Webdunia - Bharat's app for daily news and videos

Install App

టూత్ పేస్ట్ ఎలాంటిది వాడుతున్నారో చెక్ చేసుకోండి

నవ్వుకు దంతాలు మరింత అందాన్నిస్తాయి. దంతాల పరిశుభ్రతే ఆరోగ్యానికి మూలం. దేశంలోని ప్రజలు దాదాపు 51 శాతం మాత్రమే టూత్ పేస్టు, టూత్ బ్రష్‌ను వాడుతున్నారంటే నమ్మబుద్ధి కావట్లేదు కదూ... అందునా భారతదేశంలో నివసించే ప్రజల్లో దంత సమస్యలపై లేదా దంతాలను కాపాడుక

Webdunia
సోమవారం, 7 నవంబరు 2016 (17:23 IST)
నవ్వుకు దంతాలు మరింత అందాన్నిస్తాయి. దంతాల పరిశుభ్రతే ఆరోగ్యానికి మూలం. దేశంలోని ప్రజలు దాదాపు 51 శాతం మాత్రమే టూత్ పేస్టు, టూత్ బ్రష్‌ను వాడుతున్నారంటే నమ్మబుద్ధి కావట్లేదు కదూ... అందునా భారతదేశంలో నివసించే ప్రజల్లో దంత సమస్యలపై లేదా దంతాలను కాపాడుకోవడం ఎలాగో తెలుసుకోలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం దంతాలపై అవగాహన లేకపోవడమేనంటున్నారు వైద్యులు. 
 
దేశంలోని కేవలం 19 శాతం మంది ప్రజలు మాత్రమే ఉదయం, రాత్రి రెండు పూటలా దంతావధానం చేస్తున్నట్లు ఓ సర్వేలో తెలిసింది. అలగే పంటి నొప్పి కలిగినప్పుడు దేశంలోని 82 శాతం మంది ప్రజలు వైద్యుల వద్దకు వెళ్ళి చికిత్స చేసుకునేందుకు వెనుకాడుతున్నారు. అదే నూరు మందిలో కేవలం ముగ్గురు మాత్రమే నిత్యం ప్రతి ఏడాదికి ఒకసారి తమ దంత పరీక్షల కొరకు వైద్యుల వద్దకు వెళుతుంటారని ఆ సర్వే ఫలితాలు వెలువరించింది.
 
టూత్ పౌడర్ లేదా టూత్ పేస్ట్
దంతావధానం చేసేందుకు టూత్ పౌడర్ లేదా టూత్ పేస్ట్ ఈ రెండింటిలో ఏదైనా ఒక్కటి మాత్రమే ఎంచుకోవాలి. ఎందుకంటే వీటిలో ఏదో ఒకదానితోనే బ్రష్ చేయగలుగుతారు. దీంతో దంతావధానం సరిగా చేయగలుగుతారు. ఒకవేళ మీరు టూత్ పౌడర్‌ను వినియోగించాలనుకుంటే ఆ పౌడర్ నున్నగా ఉండేలా చూసుకోండి. 
 
మీరు వాడే టూత్ పేస్ట్ ఎలా ఉండాలంటే...
* ఏదైనా మంచి కంపెనీ లేదా మంచి బ్రాండ్ కలిగిన టూత్ పేస్ట్‌ను ఉపయోగించండి.
* టూత్ పేస్ట రంగు, రుచి, సువాసనకు బదులుగా దాని పనితనమెంతో తెలుసుకోండి. 
* ఆహారం లేదా నీరు తీసుకునే సమయంలో మీ దంతాలకు చల్లగా-వేడిగా అనిపిస్తే మెడికేటెడ్ టూత్‌పేస్ట్‌ను ఉపయోగించండి. 
 * ఎక్కువ వైటనర్స్ కలిగిన టూత్ పేస్ట్‌ను ఎక్కువకాలంపాటు వాడటం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు దంతవైద్య నిపుణులు. 
 
* ఫ్లోరైడ్‌తో కూడుకున్న టూత్ పేస్ట్‌ను వాడదలచుకుంటే వైద్యుల సలహా మేరకు వాడండి.
* చిన్నపిల్లలకు ఫ్లోరైడ్‌తో కూడుకున్న టూత్ పేస్ట్ ఇవ్వకండి. 
* ఎట్టి పరిస్థితుల్లోను ఏ రకానికి చెందిన టూత్ పేస్ట్‌ను మింగకండి.

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

తర్వాతి కథనం
Show comments