Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోటల్ తిండికి అలవాటు పడ్డారా? తస్మాత్ జాగ్రత్త!

Webdunia
శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (15:56 IST)
ఇంటి తిండి అంటే అలుసా? హోటల్ తిండికి అలవాటు పడ్డారా? అయితే జాగ్రత్త సుమా. హోటల్‌లో తెల్లటి ఇడ్లీ, తెల్లటి అన్నం, దోసెలు, పూరీలు, చపాతీలు, పరోటాలను వెంట వెంటనే ఆర్డర్ చేసే వారు మీరైతే కాస్త ఆగండి. ఇంకా హోటల్‌లో తయారు చేసే విధానం గురించి తెలుసుకుంటే ఇక హోటల్ ఫుడ్డా వద్దు బాబోయ్ అంటూ పరిగెత్తక మానరు. 
 
తెల్లటి ఇడ్లీ కోసం హోటల్స్‌లో ఉపయోగించే సోడా, ఈస్ట్ వంటివి అనారోగ్యాలకు దారితీస్తాయి. ఇడ్లీలో మిగిలిన అన్నాన్ని కలపడం ద్వారా మధుమేహ వ్యాధిగ్రస్థులకు, పిల్లలకు ఏమాత్రం మంచిది కాదు. గోధుమలు, బియ్యం వంటి వాటిని శుభ్రం చేయకుండా పొట్టుతో పాటు పిండి కొట్టేయడం ద్వారా లేనిపోని అనారోగ్య సమస్యలు తప్పవు. ఇంకా దోసెలు పల్చగా ఉండేందుకు పిండిలో చక్కెర, సున్ని పిండి, మైదా చేర్చుతున్నారు. 
 
హోటల్ ఫుడ్‌లో కలిపే కలరింగ్ ఏజెంట్స్ ద్వారా చర్మ, పేగు, ఆస్తమా వంటి రోగాలు ఏర్పడటమే గాకుండా వ్యాధినిరోధక శక్తి, ఎముకలు బలహీనమవుతాయి. హోటల్ ఫుడ్‌లో ఇంట్లో కంటే అధికంగా ఉప్పును చేర్చుతారు. ఇది రక్తపోటు, గుండెపోటు, పక్షవాతం వంటి రోగాలు తప్పవు. వాడిన నూనెలను మళ్లీ మళ్లీ వాడటం ద్వారా ఒబిసిటీ తప్పదంటున్నారు వైద్యులు. 
 
ఇంకా హోటల్ ఫుడ్‌లో చక్కర శాతం అధికంగా ఉంటుంది. జ్యూస్‌, ఐస్‌క్రీమ్‌లను ఎక్కువగా తీసుకోకూడదు. అందుచేత హోటల్ ఫుడ్ తీసుకునేటప్పడు ఒకటికి నాలుగుసార్లు ఆలోచించండి. తప్పని పక్షంలో క్వాలిటీ విషయంలో రాజీపడకండని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments