Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్ల సమస్యలు..చిట్కాలు..!

Webdunia
సోమవారం, 16 మార్చి 2015 (16:01 IST)
మానవ శరీర భాగాలలో ప్రధానమైనవి కళ్లు. కంటి చూపు కరువైతే మనుగడ కష్టతరమవుతుంది. ఇటీవల కాలంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరికీ కళ్ల మంటలు, చూపు మందగించడం వంటి పలు కంటికి సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నాయి. 
 
అందుకు గల కారణాలు అనేకం ఉన్నప్పటికీ ముఖ్యంగా నిత్యం చూసే టీవీలు, మొబైళ్లు, కంప్యూటర్ల వలన, తీసుకునే ఆహారంలో పోషకాల లోటు కారణంగా కంటికి సంబంధిత సమస్యలు ఏర్పడుతున్నాయని వైద్యులు తెలుపుతున్నారు. కంటి సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరి.
 
- ప్రతి రోజూ ఉదయం లేత ఎండలో కొన్ని నిముషాలపాటు సూర్య కాంతిపై కన్నులను ఎక్స్‌పోజ్ చేయాలి. 
- నువ్వుల నూనెతో రోజూ అరికాళ్ళ మర్దన చేయటం వలన దృష్టి నిర్మలంగా ఉండి, నేత్ర వ్యాధులు రాకుండా నివారిస్తుంది.
- నోట్లో చల్లని నీటిని ఉంచుకొని ఉమ్మేసి, ఇలా 2-4 సార్లు రోజులో చేయటం వల్ల మంచి నిర్మలమైన దృష్టి లభిస్తుంది.
- వెల్లుల్లి, తేనెతో చేయబడిన సన్‌డ్రాప్స్‌ను గాజు నాళికతో ప్రతి కన్నులో వేసుకుని సూర్యకాంతికి ఎదురుగా కూర్చొని కన్ను మూసుకుని ఐదు నిమిషాలు అలాగే ఉండాలి. ఇదో కంటి వ్యాయామం. దృష్టిలోపాన్ని నివారిస్తుంది.
- నిత్యం స్నానానికి గోరువెచ్చని నీటిని ఉపయోగిస్తే కంటికి మంచిది.
- యోగాసనాల్లో మత్స్యాసనం కను దృష్టి సంరక్షణకు ఉపయుక్తం చేస్తుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments