Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకి సుమారు 25 గ్రాముల చొప్పున 3 సార్లు పండ్లు తీసుకోవాలి-హెల్త్ టిప్స్

రోజుకి సుమారు 25 గ్రాముల చొప్పున మూడుసార్లు పండ్లు, కూరగాయలు తినటం తీసుకోవాలి. అలాగే రోజుకి 70 గ్రాములకు తక్కువ కాకుండా ప్రోటీన్లనూ తీసుకోవాలి. ఇవి రక్తంలోకి ఇన్సులిన్‌ స్రావాన్ని నియంత్రించి, జీవక్రి

Webdunia
ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (17:38 IST)
రోజుకి సుమారు 25 గ్రాముల చొప్పున మూడుసార్లు పండ్లు, కూరగాయలు తినటం తీసుకోవాలి. అలాగే రోజుకి 70 గ్రాములకు తక్కువ కాకుండా ప్రోటీన్లనూ తీసుకోవాలి. ఇవి రక్తంలోకి ఇన్సులిన్‌ స్రావాన్ని నియంత్రించి, జీవక్రియలకు ఉత్తేజాన్నిస్తాయి.
 
రాత్రిపూట రోజుకి 6-7 గంటలు నిద్రపోవటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆలస్యంగా పడుకొని, తగినంత నిద్రపోనివారిలో ఒత్తిడి పెరగటమే కాదు, శరీరంలో అవయవాల చుట్టూ కొవ్వు కూడా పేరుకుపోయి ఒబిసిటీ ఆవహిస్తుంది. 
 
చాలామంది బరువు తగ్గించుకోవటానికి ఉపవాసాలు చేస్తుంటారు. దీంతో మేలు కన్నా కీడే ఎక్కువ. పూర్తిగా ఆహారం తీసుకోకుండా ఉంటే జీవక్రియల వేగం మందగించి, శరీరంలో కొవ్వు పేరుకుపోవటానికి దోహదం చేస్తుంది.
 
నిద్రపోయే ముందూ నిద్ర లేచాక కూడా చేయాల్సిన పనుల గురించి సతమతమయ్యే వారు చాలామందే. దీనివల్ల ఒరిగేదేమీ లేకపోయినా ఒత్తిడి పెరిగిపోతుంది. రక్తపోటు సమస్య ఇబ్బందిపెడుతుంది. 
 
రక్తపోటును దూరంగా ఉంచుకోవాలంటే.. ఉదయం కాసేపు వ్యాయామం చేయాలి. యోగాకు సమయం కేటాయించాలి. ఓ అరగంట మొక్కలకు నీళ్లుపెట్టడం, ప్రూనింగ్‌ చేయడం వంటి పనులు మనసుని తేలిక పరుస్తాయి. శరీరానికి చురుకుదనం వస్తుంది.

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments