Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్య ర‌హ‌స్యాలివి... చిన్న‌వే... పాటించి చూడండి!!

రోజూ మ‌న‌కు చిన్న చిన్న స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. మ‌నిషి అన్నాక బాధ‌లు స‌హ‌జం. అయితే... చిన్నచిన్న చిట్కాలు పాటించి వాటిని మ‌నం దూరం చేసుకోవ‌చ్చు. త‌ల‌నొప్పి: త‌గ్గాలంటే, 10-15 తుల‌సి ఆకులు తీసుకుని దానికి వెల్లుల్లిపాయ‌లు, ఒక టీస్పూను శొంఠి పొడిని క‌

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2016 (20:16 IST)
రోజూ మ‌న‌కు చిన్న చిన్న స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. మ‌నిషి అన్నాక బాధ‌లు స‌హ‌జం. అయితే... చిన్నచిన్న చిట్కాలు పాటించి వాటిని మ‌నం దూరం చేసుకోవ‌చ్చు.
 
త‌ల‌నొప్పి: త‌గ్గాలంటే, 10-15 తుల‌సి ఆకులు తీసుకుని దానికి వెల్లుల్లిపాయ‌లు, ఒక టీస్పూను శొంఠి పొడిని క‌లిపి మెత్త‌గా రుబ్బి, ఆ మెత్త‌టి మిశ్ర‌మాన్ని నుదిటికి రాసుకోవాలి. అలాగే ఉల్లిపాయ‌ల్ని మెత్త‌గా నూరి ఆ ముద్ద‌ను నుదిటిపై పెట్టుకుంటే ఎలాంటి త‌ల‌నొప్పి అయినా మ‌టుమాయం అయిపోతుంది.
 
ద‌గ్గు: అర క‌ప్పు నిమ్మ‌ర‌సంలో కాస్త అల్లం ర‌సం క‌లుపుకొని తాగితే, ద‌గ్గు నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఇలా రోజుకి రెండు మూడు సార్లు తాగితే మంచి ఫ‌లితం ఉంటుంది.
 
వికారం: అల్లం ముక్క‌ను నిప్పుల మీద కాల్చి తింటే వికారం త‌గ్గుతుంది. నోట్లో నీళ్లు ఊరిన‌ట్లు ఉండే స‌మ‌స్యా త‌గ్గుతుంది.
 
అజీర్ణం: ఇంగువ జీర్ణశ‌క్తిని ఇస్తుంది. భోజ‌నానంత‌రం చిటికెడు ఇంగువ‌, చిటికెడు ఉప్పును మ‌జ్జిగ‌లో క‌లిపి తీసుకుంటే గ్యాస్ త‌గ్గుతుంది. దీనివ‌ల్ల ఆహారం చ‌క్క‌గా జీర్ణం అవుతుంది.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments