Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒత్తిడిని అధిగమించి... హెల్దీ హార్ట్ కోసం ఈ టిప్స్

ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. జీవనశైలిని పూర్తిగా మార్చుకోవాలి. పని మీద ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఖాళీ సమయంలో ఇష్టమైన వ్యాపకం పెట్టుకోవాలి. చికాకు పెడుతున్న అంశం మనసులోకి రానంతగా వ్యాపకాలను కల్పించుకోవడం మంచిది. ఒకసారి చిన్నప్పటి స్నేహితులను గుర్త

Webdunia
మంగళవారం, 24 మే 2016 (19:48 IST)
ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. జీవనశైలిని పూర్తిగా మార్చుకోవాలి. పని మీద ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఖాళీ సమయంలో ఇష్టమైన వ్యాపకం పెట్టుకోవాలి. చికాకు పెడుతున్న అంశం మనసులోకి రానంతగా వ్యాపకాలను కల్పించుకోవడం మంచిది. ఒకసారి చిన్నప్పటి స్నేహితులను గుర్తు చేసుకుని కలవడానికి ప్రయత్నించాలి. దూరాన ఉన్నవారితో ఫోన్ చేసి కబుర్లు చెప్పాలి. కంటినిండా నిద్రపోవాలి. నిద్రపట్టకపోతే మాత్రం స్లీపింగ్ టాబ్లెట్లను ఆశ్రయించవద్దు. నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలు తాగండి. 
 
రోజూ అరగంట నడవండి. యోగా చేయండి. జంక్ ఫుడ్‌ను పూర్తిగా మానేసి తాజాపండ్లు, కూరగాయలను తీసుకోవాలి. ఆలోచనలను సానుకూల దృక్పథంలో సాగనివ్వాలి. మరోవైపు మారిన జీవన విధానం, ఒత్తిడి, వ్యాయామ లేమి మూలంగా గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి. గుండె జబ్బులు వచ్చిన తర్వాత బాధపడటం కంటే చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రాకుండా చూసుకోవచ్చు. ఇందుకోసం పెద్దగా శ్రమపడాల్సిన పనిలేదు. 
 
* ప్రతిరోజూ మెనూలో పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. 
* ఉప్పు వీలైనంత వరకు తగ్గించాలి. 
* వాకింగ్ చేస్తే గుండెకు మంచిది. 
*  కాబట్టి రోజూ 45 నిమిషాలు నడవండి 
*  వీలైనంత వరకు లిఫ్ట్ వాడకాన్ని తగ్గించి నడిచి మెట్టెక్కడం అలవాటు చేసుకోండి. 
* ఆహారంలో కొవ్వు పదార్థాలు లేకుండా చూసుకోండి. 
*  కొలెస్ట్రాల్ పరీక్షలు, బ్లడ్ షుగర్, బీపీని చెక్ చేయించుకోండి
* బరువును నియంత్రణలో ఉంచుకోండి 
* ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోండి. 
ఈ చిట్కాలు పాటిస్తే గుండెను పదిలం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటానంటూ భర్తకు సవాల్, మనస్తాపంతో భర్త ఆత్మహత్య

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

ఫిబ్రవరి 10 నుండి 11 వరకు ఫ్రాన్స్‌లో ఏఐ సదస్సు.. హాజరు కానున్న ప్రధాని

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నెగటివ్ టాక్, అల్లు అర్జున్ 'పుష్ప కా బాప్' కేక్ కట్

Game Changer: తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.186 కోట్ల కలెక్షన్స్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

తర్వాతి కథనం
Show comments