Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ పండుతో కిడ్నీ స్టోన్స్‌ని, పొట్టని కరిగించుకోవచ్చు....

పచ్చని కూరగాయలు, ధాన్యాలు అలాగే పిండి పదార్థాలను, పండ్లను తినడం వల్ల శారీరక శక్తి పెరుగుతుంది. దానితోపాటు వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పళ్లన్నీ ముఖ్యమైనవే అయినా అనాసపండు ప్రత్యేకత కలిగినది. చక్కని రుచి, సువాసన కలిగిన అనాసపం

Webdunia
శనివారం, 4 ఫిబ్రవరి 2017 (20:34 IST)
పచ్చని కూరగాయలు, ధాన్యాలు అలాగే పిండి పదార్థాలను, పండ్లను తినడం వల్ల శారీరక శక్తి పెరుగుతుంది. దానితోపాటు వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పళ్లన్నీ ముఖ్యమైనవే అయినా అనాసపండు ప్రత్యేకత కలిగినది. చక్కని రుచి, సువాసన కలిగిన అనాసపండు 85 శాతం నీటిని కలిగి ఉంది. దీనిలో చక్కెర నిల్వలు 13 శాతం, ధాతు శక్తి 0.05 శాతం, పీచు పదార్థం 0.35 శాతం ఉన్నాయి. పైగా విటమిన్ ఎ, బి, సిలు కూడా ఉన్నాయి.
 
ఈ రోజుల్లో పొట్ట పెద్ద సమస్యగా మారింది. పొట్టను తగ్గించేందుకు అనాసపండు బాగా ఉపయోగపడుతుంది. యువతీయువకుల నుంచీ అందరి పొట్టను తగ్గించే శక్తి ఈ అనాసపండుకి ఉంది. ఒక అనాసపండుని చిన్నచిన్న ముక్కలుగా కోసి, నాలుగు టీ స్పూన్‌ల వాము పొడి అందులో వేసి బాగా కలపాలి. తర్వాత అందులో ఒక గ్లాసు నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. తర్వాత రాత్రంతా దానిని అలాగే ఉంచి మర్నాడు ఉదయాన్నే వడకట్టి ఆ కషాయాన్ని పరగడుపునే తాగాలి.
 
ఇదేవిధంగా పది రోజులు వరుసగా తాగితే పొట్ట తగ్గడం మొదలవుతుంది. అనాసపండు గర్భ సంచిని ముడుచుకు పోయేలా చేసే గుణాన్ని కలిగి ఉంటుంది, కాబట్టి గర్భిణిలు ఈ పండును దూరంగా ఉంచాలి. అనాసపండు పచ్చకామెర్లను నయం చేసే గుణాన్ని కలిగి ఉంది. ఇది మూత్ర పిండాలలోని రాళ్ళను కరిగిస్తుంది. ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పి మొదలైన వాటిని తగ్గిస్తుంది. పిత్తాన్ని పోగొడుతుంది. శరీరానికి కాంతిని ఇస్తుంది. శరీరానికి బలాన్ని ఇవ్వడంతో పాటు నేత్ర దృష్టిని మెరుగు పరుస్తుంది. పిల్లల చేత తరచుగా ఈ పండు రసం తాగిస్తే ఆకలి పెరుగుతుంది. ఎముకల పెరుగుదల, శారీరక పెరుగుదల ఏర్పడతాయి.
 
అనాస ఆకుల రసం కడుపులోని పురుగుల్ని నాశనం చేస్తుంది. అనాస ఆకుల రసంలో ఒక చెంచా తేనె కలిపి తాగితే విరోచనం అయ్యి కడుపులోని పురుగులు బయటపడతాయి. అనాసపండు ముక్కలను తేనెలో కలిపి తింటుంటే శారీరక శక్తి పెరుగుతుంది, నిగారింపును సంతరించుకుంటుంది. అనాసపండును తరచుగా తింటుండడం వల్ల మూత్ర పిండాలలోని రాళ్ళు కరిగిపోతాయి. గుండె దడ, బలహీనత తగ్గుతాయి. అనాసపండు రసాన్ని రోజుకి నాలుగుసార్లు ఒక ఔన్సు మోతాదుగా తీసుకుంటే నడుము నొప్పి తగ్గుతుంది. అదే రసాన్ని గొంతులో పోసుకుని కాసేపు అలాగే ఉంచుకుని మింగుతుంటే గొంతు నొప్పి, గొంతు పుండు తగ్గిపోతాయి.
 
అనాసపండు రసం పచ్చకామెర్లకు మంచి ఔషధం. కడుపు నిండుగా ఆహారం తీసుకున్న తర్వాత ఒక చిన్న అనాస ముక్కను తింటే చాలు జీర్ణమైపోతుంది. దీని రసంలో జీర్ణ వ్యవస్థను వృద్ధి చేసే ఆమ్లం ఉండటం వల్ల త్వరగా జీర్ణ శక్తి పెరుగుతుంది

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments