Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ఇంట్లో కృష్ణతులసి, లక్ష్మీ తులసి ఉన్నాయా...? వాటివల్ల కలిగే ప్రయోజనాలు...

ప్రపంచవ్యాప్తంగా భారతీయులు తులసిని పరమ పవిత్రంగా కొలుస్తుంటారు. తులసి ఉంట్లో ఉంటే పిల్లలకు ఏ గ్రహదోషాలూ అంటవని మన పూర్వీకుల ప్రగాఢ నమ్మకం. తులసి రెండు రకాలు ఎర్రపూలు పూసే చెట్టును కృష్ణతులసి అని తెల్లపూలు పూసే చెట్టును లక్ష్మీతులసి అని పిలుస్తుంటారు.

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2016 (18:55 IST)
ప్రపంచవ్యాప్తంగా భారతీయులు తులసిని పరమ పవిత్రంగా కొలుస్తుంటారు. తులసి ఉంట్లో ఉంటే పిల్లలకు ఏ గ్రహదోషాలూ అంటవని మన పూర్వీకుల ప్రగాఢ నమ్మకం. తులసి రెండు రకాలు ఎర్రపూలు పూసే చెట్టును కృష్ణతులసి అని తెల్లపూలు పూసే చెట్టును లక్ష్మీతులసి అని పిలుస్తుంటారు.
 
అయితే పూజనీయమైనదే కాక తులసిలో లెక్కలేనన్ని ఔషధ గుణాలు కూడా ఉన్నాయని అంటే ఆశ్చర్యం వేస్తుంది కదూ.. మన పెరట్లోని తులసి చెట్టు ఇచ్చే ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం.
 
ముఖ్యంగా కఫం పడుతున్న వ్యాధులపై తులసి అద్భుతంగా పనిచేస్తుంది. రక్తంతో కూడిన దగ్గు, కఫం పడుతున్నప్పుడు తులసి ఆకులు నాలుగు చొప్పున ప్రతి గంటగంటకూ తింటే దగ్గు, ఇతర సమస్యలు తగ్గుముఖం పడతాయి.
 
కడుపులోని క్రిములను పారదోలే శక్తి తులసికి ఉంది. తులసిని వాడితే క్రిములు తొలగడమే కాక రక్తహీనత కూడా నివారించబడుతుంది.
 
జీర్ణ శక్తికి తులసి చాలా మంచి మందు. తులసి ఆకులు నాలుగు, మిరియాలు రెండు వేసి మెత్తగా నూరి చిన్న మాత్రగా చేసుకుని భోజనానికి అరగంట ముందుగా వేసుకుంటే బాగా ఆకలి వేస్తుంది. తిన్నది కూడా జీర్ణమవుతుంది. 
 
ముఖ్యంగా 7, 8 ఏళ్ల పైబడిన చిన్న పిల్లలు అన్నం తినకుండా మారాం చేస్తుంటారు. ఆకలి లేదంటుంటారు. అలాంటివారికి రోజూ ఉదయం నాలుగు తులసి ఆకులు తినిపిస్తే జీర్ణక్రియ సాఫీగా జరిగి ఆకలి బాగా వేస్తుంది.
 
ప్రధానంగా తులసి జ్వరహారిణి. సాధారణ జ్వరాలు ఏవి వచ్చినా తులసి ఆకులతో కషాయం కాచి తాగితే తగ్గిపోతుంది. పైగా టైఫాయిడ్ జ్వరంలో తులసి చెట్టు కాండమును బాగా దంచి కషాయం కాచి ప్రతిపూటా తాగుతుంటే జ్వరం నెమ్మదిస్తుంది.
 
ఉబ్బసాన్ని నివారించడంలో తులసి కీలకమైన ఔషధం. ఉబ్బస నివారణ ఆయుర్వేద మందులన్నింటిలోనూ తులసి తప్పకుండా ఉంటుంది. తరచుగా ఉబ్బసానికి గురయ్యేవారు తులసి కషాయం తీసుకుంటూ ఉంటే కొన్నాళ్లకు ఉబ్బసం రాదు.
 
అవసాన దశలో ఉన్న మనిషికి తులసి తీర్థం పోయడంలో అర్థం ఏమిటంటే వారి గొంతులో కఫం ఏమైనా అడ్డుపడకుండా శ్వాస సరిగా తీసుకుంటారని ఆవిధంగా చేస్తారు. ఇదీ తులసి మహాత్మ్యం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నమో మిసైల్ కొట్టే దెబ్బకు పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్‌లో కనబడదు: నారా లోకేష్

పాకిస్థాన్ జిందాబాద్ అనే వారి కాళ్లు నిర్ధాక్షిణ్యంగా విరగ్గొట్టాలి : సీఎం హిమంత

నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆ 13 ఏళ్ల విద్యార్థి: 23 ఏళ్ల లేడీ టీచర్ షాకింగ్ న్యూస్

Pawan Kalyan: రైతన్నలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. పవన్ కల్యాణ్ (video)

Aghori లేడీ కాదు, అవాక్కయ్యారా? చంచల్ గూడ జైలుకి అఘోరి శ్రీనివాస్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత, సాయిపల్లవి ప్రాసిట్యూట్స్ : మహిళా విశ్లేషకులు ఘాటు విమర్శ

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

తర్వాతి కథనం
Show comments