ప్రతిరోజూ ఒక నువ్వుల ఉండ తింటే?

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (22:57 IST)
నువ్వుల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్లూ, ప్రోటీన్లూ వంటి ఎన్నో ఖనిజాలు దాగి ఉన్నాయి. వీటిల్లోని పైటేట్ అనే యాంటీ ఆక్సీడెంట్ క్యాన్సర్ కారకాలైన ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకుంటుంది. వీటిల్లోని పీచు జీర్ణశక్తికి తోడ్పడుతుంది. నువ్వుల్లోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.
 
1. పాలిచ్చే తల్లులకు రోజూ కొంచెం నువ్వులు పెడితే పాలు పడతాయి. ప్రతిరోజూ ఒక నువ్వుల ఉండ తినడం వలన శరీరానికి కావలసిన కాల్షియం అందుతుంది.
 
2. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి నువ్వులు మంచి ఔషధంలా పని చేస్తాయని పోషకాహార నిపుణులు సలహా ఇస్తున్నారు. నువ్వులనూనెను ఒంటికి మర్దనా చేసుకోవడం వలన కూడా కీళ్లనొప్పులు తగ్గుతాయి.
 
3. నువ్వులు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. వీటిల్లో ఉండే మెగ్నీషియం రక్త ప్రసరణ వ్యవస్థకు తోడ్పడుతుంది. అంతేకాకుండా మధుమేహం, బీపీ లను నివారిస్తుంది.
 
4. నువ్వులు ఎముకల వృద్ధికి తోడ్పడతాయి. ఆస్టియోపోరోసిస్‌ని తగ్గిస్తాయి. వీటిని తీసుకోవడం వలన చెడు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
 
5. వీటిల్లో అధిక మోతాదులో ఉండే కాపర్, కీళ్లు, కండరాల నొప్పుల్నీ మంటల్ని తగ్గించడంతో పాటు శరీరమంతా ఆక్సిజన్ సరఫరాకు తోడ్పడుతుంది.
 
6. నువ్వుల్లోని సెసమాల్ అనే కర్బన పదార్థం, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులలో రేడియేషన్ కారణంగా కణాల్లోని డిఎన్ఎ దెబ్బ తినకుండా కాపాడుతుంది. ఉదయాన్నే ఒక టీ స్పూను నువ్వుల నూనెను కాసేపు పుక్కిలించడం వల్ల నోటిలో బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇవి ఆస్త్మా రోగుల్లో శ్లేష్మాన్ని హరిస్తాయి. నిద్రలేమిని తగ్గిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

తర్వాతి కథనం
Show comments