Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనాసపండు రసాన్ని తీసుకోండి.. నడుము నొప్పిని దూరం చేసుకోండి.

పచ్చని కూరగాయలు, ధాన్యాలు అలాగే పిండి పదార్ధాలను, పండ్లను తినడం వల్ల శారీరక శక్తి పెరుగుతుంది. దాంతోపాటు వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. అనాస చక్కని రుచి, సువాసన కలిగిన అనాసపం

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2016 (10:50 IST)
పచ్చని కూరగాయలు, ధాన్యాలు అలాగే పిండి పదార్ధాలను, పండ్లను తినడం వల్ల శారీరక శక్తి పెరుగుతుంది. దాంతోపాటు వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. అనాస చక్కని రుచి, సువాసన కలిగిన అనాసపండు 85 శాతం నీటిని కలిగి ఉంది. దీనిలో చక్కెర నిల్వలు 13 శాతం, ధాతు శక్తి 0.05 శాతం, పీచు పదార్ధం 0.35 శాతం ఉన్నాయి. పైగా విటమిన్ ఎ, బి, సిలు కూడా ఉన్నాయి.
 
అనాసపండు గర్భ సంచిని ముడుచుకు పోయేలా చేసే గుణాన్ని కలిగి ఉంటుంది, కాబట్టి గర్భిణిలు ఈ పండును దూరంగా ఉంచాలి. అనాస ఆకుల రసం కడుపులోని పురుగుల్ని నాశనం చేస్తుంది. అనాస ఆకుల రసంలో ఒక చెంచా తేనె కలిపి తాగితే విరోచనం అయ్యి కడుపులోని పురుగులు బయటపడతాయి.
 
అనాసపండు పచ్చకామెర్లను నయంచేసే గుణాన్ని కలిగి ఉంది. ఇది మూత్ర పిండాలలోని రాళ్ళను కరిగిస్తుంది. ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పి మొదలైన వాటిని తగ్గిస్తుంది. పిత్తాన్ని పోగొడుతుంది. శరీరానికి కాంతినిస్తుంది. శరీరానికి బలాన్ని ఇవ్వడంతో పాటు నేత్ర దృష్టిని మెరుగు పరుస్తుంది. పిల్లలచేత తరచుగా ఈ పండు రసం తాగిస్తే ఆకలి పెరుగుతుంది. ఎముకల పెరుగుదల, శారీరక పెరుగుదల ఏర్పడతాయి. 
 
అనాసపండు రసం పచ్చకామెర్లకు మంచి ఔషధం. కడుపు నిండుగా ఆహారం తీసుకున్న తర్వాత ఒక చిన్న అనాస ముక్కను తింటే చాలు జీర్ణమైపోతుంది. దీని రసంలో జీర్ణ వ్యవస్థను వృద్ధి చేసే ఆమ్లం ఉండడం వల్ల త్వరగా జీర్ణ శక్తి పెరుగుతుంది.
 
అనాసపండు ముక్కలను తేనెలో కలిపి తింటుంటే శారీరక శక్తి పెరుగుతుంది, నిగారింపును సంతరించుకుంటుంది. అనాసపండును తరచుగా తింటుండడం వల్ల మూత్ర పిండాలలోని రాళ్ళు కరిగిపోతాయి. గుండె దడ, బలహీనత తగ్గుతాయి. అనాసపండు రసాన్ని రోజుకి నాలుగు సార్లు ఒక ఔన్సు మోతాదుగా తీసుకుంటే నడుము నొప్పి తగ్గుతుంది. అదే రసాన్ని గొంతులో పోసుకుని కాసేపు అలాగే ఉంచుకుని మింగుతుంటే గొంతు నొప్పి తగ్గిపోతుంది.

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

తర్వాతి కథనం
Show comments