Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధిక కొవ్వుకు అవిసెనూనె బెస్ట్.. ఆహారంలో చేర్చుకోండి..

అధిక కొవ్వుకు అవిసెనూనె బెస్ట్.. ఆహారంలో చేర్చుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవిసె నూనెతో శరీరానికి హానిచేసే తక్కువ సాంద్రత కలిగిన కొవ్వు అంటే ఎల్డీఎల్ త్వరగా కరిగిపోతుంది. అందుకే వారానికి మూడు సా

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2016 (13:46 IST)
అధిక కొవ్వుకు అవిసెనూనె బెస్ట్.. ఆహారంలో చేర్చుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవిసె నూనెతో శరీరానికి హానిచేసే తక్కువ సాంద్రత కలిగిన కొవ్వు అంటే ఎల్డీఎల్ త్వరగా కరిగిపోతుంది. అందుకే వారానికి మూడు సార్లు లేదా రోజువారీ ఆహారంలో అవిసె నూనెను తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
అలాగే బరువు తగ్గాలంటే... రోజుకి ఆరు నుంచి 8 గ్లాసుల నీరు తాగడం మంచిది. ఇది జీవక్రియల వేగాన్ని పెంచి శరీరం నుంచి విష పదార్థాలు, అధిక కొవ్వును తొలగించటానికి తోడ్పడుతుంది. భోజనానికి ముందు చల్లటి నీరు తాగితే జీర్ణాశయం కుంచించుకుపోయి కొంచెం తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది.

ఇంకా భోజనానికి ముందు రెండు గ్లాసుల నీరు తాగితే ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువగా తినటం కన్నా కొంచెం కొంచెంగా రోజుకి 4-6 సార్లు ఆహారం తీసుకోవటం మంచిది. క్రమం తప్పకుండా ఆహారం తీసుకోకపోతే జీవక్రియలు మందగించి, కొవ్వు పేరుకుపోవటానికి దారి తీస్తుంది.
 
ఉదయం పూట అల్పాహారం తప్పకుండా తీసుకోవాలి. తొలిసారి తీసుకునే ఈ అల్పాహారం రోజంతా జరిగే జీవక్రియల పద్ధతిని గాడిలో పెడుతుంది. ఆలస్యంగా అల్పాహారం తీసుకుంటే.. కేలరీల ఖర్చు విషయంలో చాలా సమయం వేస్టయినట్లే. బిస్కట్లు, బ్రెడ్‌, చాక్లెట్లు, ఫాస్ట్‌ఫుడ్‌, వేపుళ్లు, కేకుల వంటి వాటిల్లో ట్రాన్స్‌ఫ్యాట్స్‌ ఉంటాయి.

ఇవి రక్తంలో కొలెస్ట్రాల్‌ను పెంచి హాని చేస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ మోతాదునూ తగ్గిస్తాయి. కాబట్టి వీటి జోలికి వెళ్లకపోవటమే మంచిది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ఎంతో అవసరం. రోజుకి కనీసం రెండు లేదా మూడు కిలోమీటర్లు నడవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

తర్వాతి కథనం
Show comments