Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలీఫ్లవర్‌లో ఏముందిలే అని తీసిపారేయకండి!

Webdunia
గురువారం, 19 నవంబరు 2015 (16:52 IST)
సాధారణంగా ఆకుపచ్చగా, పసుపు, బంగారు వర్ణం, ఎరుపు వంటి రంగుల్లో కనిపించే అన్ని రకాల కూరగాయల్లో వివిధ రకాల పోషకాలు సమృద్ధిగానే ఉంటాయి. అయితే, కాలీఫ్లవర్, ముల్లంగి వంటి తెలుపు రంగులో ఉండే కూరగాయల్లో ఏముంటుందిలే అని పెద్దగా ప్రాధాన్యతనివ్వరు. ఉదాహరణకు కాలీఫ్లవర్‌నే తీసుకుందాం... 
 
ఇందులో పీచూతో పాటు విటమిన్ బి సమృద్ధిగా లభిస్తుంది. ఇందులో పోషకాలు ఎక్కువగానూ, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లూ కేన్సర్‌ నుంచి రక్షించే ఫైటో న్యూట్రియంట్లూ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇండోల్ 3 కార్బినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ స్త్రీ, పురుషలిద్దరిలోనూ రొమ్ము, ప్రత్యుత్పత్తి అవయవ కేన్సర్లు రాకుండా కాపాడుతుంది. 
 
అలాగే, ఇందులో ఉండే పీచూ నీటిశాతాన్ని, శరీర బరువును తగ్గిస్తుంది. ఈ రెండూ జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచేలా చేయడంతోబాటు కోలన్ కేన్సర్ రాకుండానూ కాపాడతుంది. ఊబకాయం, మధుమేహం, హృద్రోగం బారిన పడకుండా రక్షిస్తుంది. ఇందులోని విటమిన్-కె ఎముకల దృఢత్వానికీ దోహదపడుతుంది. 

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

Show comments