Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో బార్లీ నీళ్లు తీసుకుంటే.. మేలేంటి?

వేసవిలో బార్లీ నీళ్లు సేవించడం ద్వారా చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. బార్లీగింజల్ని నానబెట్టి ఉడికించి వడకట్టిన నీళ్లను వేసవిలో సేవించడం ద్వారా ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. వేసవిలో డీహైడ్రేషన్‌ సమస్యతో బ

Webdunia
సోమవారం, 15 మే 2017 (15:40 IST)
వేసవిలో బార్లీ నీళ్లు సేవించడం ద్వారా చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. బార్లీగింజల్ని నానబెట్టి ఉడికించి వడకట్టిన నీళ్లను వేసవిలో సేవించడం ద్వారా ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. వేసవిలో డీహైడ్రేషన్‌ సమస్యతో బాధపడేవారు.. దీన్ని తీసుకోవచ్చు.

డీహైడ్రేషన్‌ సమస్య అదుపులోకి రావడమే కాదు.. ఎండ ప్రభావం కూడా ఉండదు. మధుమేహం ఉన్నవారూ బార్లీ నీళ్లకు ప్రాధాన్యమిస్తే మేలు. ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెరస్థాయుల్లో హెచ్చుతగ్గులుండవు. ఇన్సులిన్‌ కూడా అదుపు తప్పదు. 
 
అలాగే ఉదయం పూట గ్లాసు బార్లీ నీళ్లు తాగితే చాలు. యూరినల్ ఇన్ఫెక్షన్లు, శరీరంలోని టాక్సిన్లు ఇట్టే దూరమవుతాయి. మూత్రపిండం శుభ్రం కావడంతో పాటు.. కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి. బార్లీలో పీచు, బీటా గ్లూకాన్లు అధికం. ఇవి శరీరానికి మేలు చేయడమే కాదు.. జీవక్రియ రేటు కూడా మెరుగుపరుస్తాయి. అలా బరువును అదుపులోకి ఉంచుతాయి. రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతం తగ్గించడంలోనూ బార్లీ నీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. హృద్రోగ సమస్యలూ దరి చేరకుండా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్‌ బి రక్తపోటు సమస్యను దూరం చేస్తుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రకృతిలో అమరావతిగా ఏపీ రాజధాని మోడల్ గ్రీన్ సిటీగా మార్చాలి: చంద్రబాబు

24 క్యారెట్ల బంగారం- ఆపరేషన్ సింధూర్.. అగ్గిపెట్టెలో సరిపోయేలా శాలువా.. మోదీకి గిఫ్ట్

దేవెగౌడ ఫ్యామిలీకి షాక్ : అత్యాచార కేసులో దోషిగా తేలిన రేవణ్ణ

ఆ పిల్లవాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసాడా?

IMD: ఆగస్టు 1 నుంచి 7 వరకు ఏడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

Raviteja: రవితేజ మాస్ జాతర విడుదల ఆలస్యమవుతుందా?

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

తర్వాతి కథనం
Show comments