తలనొప్పికి కారణాలేంటి...? వదిలించుకునే మార్గాలేమిటి...?

నిద్రలేమి, ఫుడ్‌ హాబిట్స్‌, మానసిక ఒత్తిళ్లు తలనొప్పికి కారణం అవుతాయి. మనం తీసుకునే ఆహారంలోనూ తలనొప్పి కారకాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాఫీలోని కెఫిన్‌, పెరుగులోని టైరమైన్‌, పులుపు పదార్థాల్లో ఉండే సిట్రస్‌ తలనొప్పిని తెప్పిస్తాయి. మన తీసుకున

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2016 (12:49 IST)
నిద్రలేమి, ఫుడ్‌ హాబిట్స్‌, మానసిక ఒత్తిళ్లు తలనొప్పికి కారణం అవుతాయి. మనం తీసుకునే ఆహారంలోనూ తలనొప్పి కారకాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాఫీలోని కెఫిన్‌, పెరుగులోని టైరమైన్‌, పులుపు పదార్థాల్లో ఉండే సిట్రస్‌ తలనొప్పిని తెప్పిస్తాయి. మన తీసుకునే ఆహారంలో కొద్దిపాటి తేడాలతో తలనొప్పి రాకుండా చేసుకోవచ్చు.
 
వెన్న, మటన్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల తలపోటు పెరుగుతుంది. విటమిన్‌-సి, డి, కాల్షియం, బి12 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. మసాలా ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత బెటర్‌. పోషకాలున్న ఆహారాలతో పాటు, మంచి నిద్ర, కొద్దిపాటి వ్యాయామం వంటివి తలనొప్పిని దూరం చేస్తాయి.
 
*కొంచెం రాళ్ల ఉప్పును చేర్చిన పాలను తీసుకోవడం ద్వారా తలనొప్పి మాయం అవుతుంది.
*ఒక గ్లాసు వేడి నీటిలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే ప్రభావం తొందరగా ఉంటుంది.
*చందనాన్ని పేస్ట్‌లా చేసుకుని నుదుటికి అప్లయ్‌ చేసినా మంచి గుణం కనిపిస్తుంది.
*కొబ్బరి నూనె వేడిని తగ్గిస్తుంది. కొబ్బరి నూనెను నుదుటిపై 15 నుంచి 20 నిమిషాల పాటు మసాజ్ చేయ‌డం వ‌ల్ల ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 
*నీరు, వెల్లుల్లి మిశ్రమాన్ని ఒక టేబుల్‌ స్పూన్‌ తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు.
*యాపిల్‌ పండుతో పాటు ఒక గ్లాసు గోరువెచ్చటి పాలు తీసుకున్నా తలనొప్పి మటుమాయం అవుతుంది.
*యూకలిప్టస్‌ తైలం తలనొప్పి నివారిణిగా బాగా పని చేస్తుంది.
*గోరువెచ్చని ఆవుపాలు తాగినా తలనొప్పి నుంచి రిలాక్స్ అవ్వ‌చ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments