Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్రాక్షరసం తాగండి ఆరోగ్యంగా ఉండండి.. గ్రేప్ జ్యూస్‌తో బ్యూటీ...?

Webdunia
మంగళవారం, 23 జూన్ 2015 (18:04 IST)
ద్రాక్షరసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు అందాన్ని మెరుగుపరుచుకునేందుకు ఉపయోగపడుతుంది. ద్రాక్ష పండ్లలో అల్జీమర్స్‌ను నయం చేసే లక్షణాలున్నాయి. ఇవి శరీరంలోని కొవ్వును యూరిన్ ద్వారా వెలివేయడంతో పాటు యూరిక్ ఆమ్లాన్ని కూడా తొలగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే ద్రాక్ష జ్యూస్‌ ద్వారా అందాన్ని మెరుగుపరుచుకోవచ్చు. 
 
గ్రేప్ తొక్కలను ముఖానికి మాస్క్‌లా వేసుకోవడం ద్వారా చర్మాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ఇందులో యాంటీయాక్సిడెంట్లు చర్మానికి క్లెన్సర్‌లా ఉపయోగపడుతుంది. చర్మానికి కొత్త కాంతిని ఇస్తుంది. సన్ టాన్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. వేసవిలో రోజూ ఒక గ్లాసు గ్రేప్ జ్యూస్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యంతో పాటు మెరిసే సౌందర్యాన్ని పొందవచ్చు. 
 
ద్రాక్ష రసాన్ని తీసుకోవడం ద్వారా రక్తాన్ని శుద్ధీకరిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇందులో ఐరన్ అనారోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది. శరీరానికి తేమనిస్తుంది. కంటికి మేలు చేస్తుంది. కంటి కిందటి వలయాలకు చెక్ పెట్టాలంటే.. ద్రాక్ష పండ్లను కట్ చేసి ఆ రసాన్ని కంటి కింద నల్లటి వలయాలపై రాస్తే ఫలితం ఉంటుంది.

ఒక స్పూన్ ద్రాక్ష రసంతో పాటు ఒక స్పూన్ గుడ్డులోని తెల్లసొనను కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్‌లో వేసుకుని పది నిమిషాల తర్వాత చల్లటి నీటిలో కడిగేస్తే చర్మం పొడిబారదు. చర్మానికి నిగారింపు సంతరించుకుంటుంది.

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments