Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లంతో అలాంటి అనారోగ్యాలన్నీ ఔట్ (Video)

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (22:32 IST)
ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో అల్లం ఒకటి. దీంతో అద్భుతమైన వైద్యం చేవచ్చని నాటు వైద్యులు చెపుతారు. భారతీయ వైద్యులు నిరూపించారు కూడా. ముఖ్యంగా పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ.
 
పిల్లలకు అజీర్తి, కడుపునొప్పి వస్తే ఒక స్పూను అల్లం రసం కానీ చిటికెడు శొంఠి పొడి కానీ ఇస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది. అలాగే, పెద్దవాళ్లు మోతాదుకు సరిపడా తీసుకోవచ్చు.
 
జలుబు, ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నప్పుడు తేనెలో అల్లం ముక్కలు కాని, శొంఠిపొడి కాని కలిపి తీసుకోవాలి. తలనొప్పి, జర్వం ఉన్నప్పుడు అల్లం రసం కాని, అల్లం టీ కాని తాగితే ఉపశమనం కలుగుతుంది.
 
అలాగే, పైత్యంతో వాంతులవుతుంటే శొంఠిని తేనెతో కలిపి చప్పరించాలి. వేవిళ్ళ సమయంలో అయ్యే వాంతుల నివారణకు కూడా అల్లం బాగా పని చేస్తుంది. నోరు రుచి లేనట్లు ఉండడాన్ని పొగొడుతుంది.
 
జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు రోజుకు మూడుసార్లు అల్లంతో తయారైన హెర్బల్ టీని తాగచ్చు. అయితే రోజులో నాలుగు సార్లకు మించి అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు. మరీ ముఖ్యంగా కడుపులో అల్సర్ ఉన్న వాళ్లు అసలు తాగకూడదు.
 
అల్లం టీ తాగినప్పుడు ఆహ్లాదంగా అనిపించుకుండా కడుపులో వికారం కాని మరే సైడ్ఎఫెక్ట్ కనిపించినా అల్సర్ వంటి సమస్యలున్నాయేమోనని డాక్టర్‌ని సంప్రదించడం అవసరం.
 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments