వెల్లుల్లి గుజ్జును అక్కడ అప్లై చేస్తే...?

సాధారణంగా భారతీయులు వెల్లుల్లి లేకుండా వంటలు చేయడం అసంపూర్తిగా భావిస్తారు. వెల్లుల్లి వలనే వంటకాలకు మంచి రుచి, సువాసన వస్తుంది. దీనివలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం.

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (17:29 IST)
సాధారణంగా భారతీయులు వెల్లుల్లి లేకుండా వంటలు చేయడం అసంపూర్తిగా భావిస్తారు. వెల్లుల్లి వలనే వంటకాలకు మంచి రుచి, సువాసన వస్తుంది.  దీనివలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం.
 
1. వెల్లుల్లి మన శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
 
2. వెల్లుల్లిలో యాంటీ ఇన్ప్లమేటర్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ లక్షణాలు వివిధ రకాల అలర్జీల బారిన పడకుండా మన శరీరాన్ని రక్షిస్తుంది. వెల్లుల్లిని ప్రతిరోజు తీసుకోవడం వలన కీళ్లవాపు నివారించబడుతుంది. పచ్చి వెల్లుల్లి రసం దద్దుర్లు, కీటక కాటు వలన ఏర్పడిన దురదను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
 
3. వెల్లుల్లిని ప్రతిరోజు ఉపయోగించడం వలన తరచూ వచ్చే జలుబుకు ఉపశమనం కలుగుతుంది. ఆస్త్మా, శ్వాస తీసుకోవడం వల్ల ఇబ్బంది వంటి ఊపిరితిత్తుల రుగ్మతలు తగ్గించడానికి వెల్లుల్లి ఎంతో ఉపయోగపడుతుంది.
 
4. వెల్లుల్లి ఇన్సులిన్‌ను పెంచుతుంది. మధుమేహగ్రస్తుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
 
5. వెల్లుల్లి గుజ్జును లేదా వెల్లుల్లిని ఉడికించిన నీటిని మెుటిమలు ఉన్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల మెుటిమలు మరియు మచ్చలను సమర్ధవంతంగా నివారిస్తుంది.
 
6. వారానికి 5 వెల్లుల్లిపాయలను పచ్చివి తినటం వలన కేన్సర్ వ్యాధిని 40 నుంచి 50 శాతం వరకు నిర్మూలించవచ్చట. కనుక దీనిని సర్వరోగ నివారిణి అనవచ్చు.
 
7. వెల్లుల్లిలో ధయమిన్ లోపాన్ని తగ్గించి అభివృద్ది చేసే గుణం కూడా పుష్కలంగా ఉంది. వెల్లుల్లిలో విటమిన్ సి అధికంగా ఉండటం వలన నోటి వ్యాధులకు దివ్యఔషధంగా పనిచేస్తుంది.
 
8. వెల్లుల్లిని క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల బరువును కూడా తగ్గించుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ మాజీ ఓఎస్డీ వద్ద విచారణ

Jagan: ఏపీ లిక్కర్ కేసులో జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

Pawan Kalyan: పీఠాపురంలో 3 ఎకరాల భూమిని కొనుగోలు చేయనున్న పవన్

శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం - దిత్వాహ్‌గా నామకరణం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

తర్వాతి కథనం
Show comments