Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ ఫోన్, కంప్యూటర్లలో గంటల పాటు పనిచేస్తున్నారా?: చేతివేళ్లు భద్రం గురూ...

కంప్యూటర్లలో గంటల పాటు పనిచేస్తున్నారా? అయితే మీ చేతివేళ్లు భద్రం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. టెక్నాలజీ సాకుతో ఉదయం లేచిన వద్ద నుంచి రాత్రి నిద్రించేంత వరకు.. స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. సెల్

Webdunia
బుధవారం, 28 జూన్ 2017 (11:03 IST)
కంప్యూటర్లలో గంటల పాటు పనిచేస్తున్నారా? అయితే మీ చేతివేళ్లు భద్రం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. టెక్నాలజీ సాకుతో ఉదయం లేచిన వద్ద నుంచి రాత్రి నిద్రించేంత వరకు.. స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. సెల్ ఫోన్‌తో పాటు కంప్యూటర్లను అత్యధికంగా ఉపయోగించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. వీటి వాడకం ద్వారా కంటి సమస్యలు తప్పవ్. 
 
అయితే వీటిని ఉపయోగిస్తే కంటితో పాటు చేతి వేళ్లకు కూడా దెబ్బేనని తెలుసుకోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సెల్ ఫోన్‌ను అదేపనిగా చూస్తుండటం, చేతివేళ్లతో ఛాటింగ్ చేస్తుండటం.. అలాగే కంప్యూటర్లో మౌస్, కీబోర్డులను అదే పనిగా ఉపయోగించడం ద్వారా చేతి వేళ్ళలో నొప్పి ప్రారంభం అవుతుంది. ఈ నొప్పి నుంచి చేతివేళ్ళకు ఉపశమనం లభించాలంటే? చేతివేళ్లలో నొప్పి వున్న ప్రాంతంలో ఐస్ ప్యాక్ లేదా హాట్ ప్యాక్ పెట్టాలి. 
 
చేతి వేళ్ల నొప్పిని తగ్గేందుకు కొన్ని వ్యాయామాలు చేయాలి. మణికట్టు ప్రాంతంలో నొప్పి వున్నట్లైతే చేతికి స్మైలీ బాల్‌ను నొక్కుతూ వుంటే సరిపోతుంది. ఇలా చేసినా నొప్పి తగ్గలేదంటే.. వెంటనే ఫిజియోథెరపిస్టులను సంప్రదించాలి. క్యాల్షియంతో కూడిన ఆహారం తీసుకోవాలి. రోజూ అరగంట నడవడం చేతుల్ని తిప్పే వ్యాయామాలు చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నలుగురు పిల్లలకు తండ్రి.. ప్రియురాలికి పెళ్లి నిశ్చమైందని యాసిడ్ దాడి.. ఎక్కడ?

RK Roja: ఆర్కే రోజాపై భూ ఆక్రమణ ఫిర్యాదులు.. టీడీపీని ఆశ్రయించిన బాధితులు

Vijaysai Reddy: తిరుమల దర్శనం.. మొక్కులు- బీజేపీలో చేరనున్న విజయ సాయిరెడ్డి? (video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్వల్ప అస్వస్థత.. ఏమైందంటే? (video)

ఆలయంలోకి వచ్చాడని దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

తర్వాతి కథనం
Show comments