Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లతో శారీరక శ్రమ తగ్గింది.. కంటికి శ్రమ ఎక్కువైంది.. ఈ చిట్కాలు పాటించండి

కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు వంటి ఫోన్లతో పాటు టెక్నాలజీ బాగా పెరిగిపోవడంతో శరీరానికి శ్రమ తగ్గిపోయింది. కానీ కంటికి శ్రమ ఎక్కువైపోయింది. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడంతో పాటు చేతుల్లో స్మార్ట్

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (17:42 IST)
కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు వంటి ఫోన్లతో పాటు టెక్నాలజీ బాగా పెరిగిపోవడంతో శరీరానికి శ్రమ తగ్గిపోయింది. కానీ కంటికి శ్రమ ఎక్కువైపోయింది. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడంతో పాటు చేతుల్లో స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో కంటికి శ్రమ పెరిగిపోవడంతో పాటు కంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యల నుండి బయటపడేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
ఎక్కువ సమయం కంప్యూటర్‌ ముందు కూర్చుని పనిచేసేవారు ప్రతి 20 నిమిషాలకోసారి కొన్ని సెకన్లపాటు విరామం తీసుకుని ఓ 20 అడుగుల దూరంలో ఉన్న ఏదో ఒక వస్తువుని చూడాలి. అలా చేయడం ద్వారా కళ్ళు నీరుకారడం, ఎర్రబారడం, దురద మంట రావడం, పొడిబారడం వంటి సమస్యలను అదిగమించవచ్చు. అంతేకాదు పని మధ్యలో కొన్నిసార్లు లేచి 20 అడుగులు నడవడం వల్ల శారీరక వ్యాయామంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. 
 
అలాగే కంటి కోసం ఆరోగ్యం కోసం పోషకాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తాజా ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు వారానికి రెండుసార్లు చేపలు.. నెలకోసారి మాంసం తీసుకునే వారిలో కంటి సమస్యలు ఉండవని రోజూ ఒక గ్లాసుడు క్యారెట్ జ్యూస్ సేవిస్తే కంటికి ఎంతో మేలు చేసినవారవుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments