Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట కోడిగుడ్లు తీసుకోవచ్చా? తీసుకోకూడదా?

Webdunia
గురువారం, 28 మే 2015 (17:49 IST)
బాడీ బిల్డర్స్ డజన్ల సంఖ్యలో కోడిగుడ్లు తీసుకోవడం చూస్తుంటాం. అయితే వారు తీసుకునే కోడిగుడ్ల క్యాలరీలను వర్కవుట్స్ ద్వారా ఖర్చు చేసేస్తారు. కండరాల పుష్టికి విటమిన్స్ అవసరం. కోడిగుడ్డులోని తెల్లసొనలో అధిక ప్రోటీన్లు ఉంటాయి. ఇందుకే బాడీ బిల్డర్స్ కోడిగుడ్లను అధికంగా తీసుకుంటారు. అయితే బాడీ బిల్డర్స్ సంగతి పక్కనపెడితే.. కంప్యూటర్స్ ముందు కూర్చుని ఉద్యోగం చేసే వారు రోజుకో కోడిగుడ్డు తీసుకుంటే సరిపోతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. వారి వారి ఆరోగ్యానికి తగ్గట్టు తీసుకోవాలని వారు చెబుతున్నారు.
 
శారీరకంగా ఎక్కువ శ్రమించే వారికి ఒక రోజుకు రెండు లేదా మూడు కోడిగుడ్లు తీసుకోవచ్చు. కోడిగుడ్డులోని తెల్లసొన మాత్రమే తీసుకునే వారు 3-4 వరకు తీసుకోవచ్చు. పసుపు సొన తీసుకుంటే రోజు ఒకే ఒక కోడిగుడ్డు తీసుకోవచ్చు. ఇందులో విటమిన్స్, మినరల్స్, ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు లభిస్తుంది. ఒమెగా 3 ఫ్యాట్స్ లభిస్తాయి. రాత్రిపూట కోడిగుడ్లు తీసుకోవచ్చు. కానీ నిద్రించేందుకు రెండు గంటల ముందు తీసుకోవడం మంచిది. 
 
కోడిగుడ్లు అధికంగా తీసుకుంటే హృద్రోగ సమస్యలు తప్పవు. తగిన వ్యాయామం చేస్తూనే కోడిగుడ్లను తీసుకోవాలి. కోడిగుడ్డును ఎక్కువ సేపు ఉడికించకూడదు. ఆమ్లెట్‌ను కూరగాయలతో తీసుకుంటే వెరైటీగా ఉంటుంది.

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

Show comments