Webdunia - Bharat's app for daily news and videos

Install App

మజ్జిగ అన్నంలో ఉల్లిపాయ తింటే?

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (23:21 IST)
ఉల్లిపాయని క్రమం తప్పకుండా తినేవారి ఎముకల పటుత్వం బాగా ఉంటుంది. రెండుపూటలా పచ్చి ఉల్లిపాయని మజ్జిగ అన్నంతో తినేవారు నిత్య ఆరోగ్యవంతులుగా రాణిస్తారు. ఉల్లిపాయలో యాంటిబయోటిక్, ఏంటి సెప్టిక్, యాంటీమైక్రోబియాల్ లక్షణాలు ఉండుట వలన ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఉల్లిపాయలో సల్ఫర్, ఫైబర్, పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. అలాగే కొవ్వు, కొలెస్ట్రాల్ మరియు సోడియం తక్కువగా ఉంటాయి. 
 
ఉల్లిపాయ నిద్రలేమి లేదా నిద్ర రుగ్మతలను నయం చేయటంలో సహాయపడుతుంది. ఇది ఖచ్చితంగా మంచి నిద్రను ఇస్తుంది. జీర్ణక్రియ సమస్యలు ఉన్నప్పుడు మజ్జిగలో ఉల్లిపాయను తింటే జీర్ణక్రియకు సహాయం చేసే జీర్ణ రసాల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఉల్లిపాయలు క్యాన్సర్లను నిరోధించడానికి సహాయపడతాయి.
 
ఇది తల, మెడ మరియు పెద్దప్రేగు క్యాన్సర్లకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ప్రతి రోజు మజ్జిగన్నంలో ఉల్లిపాయను బాగంగా చేసుకుంటే, అస్టియోపోరోసిస్ మరియు అథెరోస్క్లెరోసిస్ నుండి రక్షణ కలుగుతుంది. ఉల్లిపాయలు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచటానికి మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం ద్వారా మధుమేహ చికిత్సలో సహాయపడతాయి. 
 
ప్రతి రోజు మజ్జిగన్నంలో ఉల్లిపాయ తింటే గుండె వ్యాధులకు కారణం అయిన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. అంతేకాక మంచి కొలస్ట్రాల్‌ను పెంచి కొరోనరీ వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది. దంతాల నొప్పి మరియు పిప్పి పన్ను నొప్పి నివారణకు మజ్జిగన్నంలో ఉల్లిపాయ తింటే చాలు. పెరుగన్నంలో లేదా మజ్జిగన్నంలో ఉల్లిపాయను ఉపయోగించటం వలన మంచి జ్ఞాపకశక్తి మరియు ఒక బలమైన నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. ఇక అన్నింటి కన్నా ముఖ్యమైనది మజ్జిగన్నంతో ఉల్లిపాయ తింటే యవ్వనంగా వుంటారన్నది నిపుణుల మాట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Birthday: బర్త్ డే జరుపుకుందామనుకుంటే.. కేకు పేలింది.. (video)

అధ్యక్షా... ఈ పోల్ ఇపుడు అవసరమా? పరువు పోగొట్టుకున్న టి.కాంగ్రెస్, రేవంత్ ఫైర్

Hall Tickets: హాల్ టిక్కెట్లు లేకపోయినా పరీక్షలు రాయడానికి అనుమతి.. ఎక్కడంటే?

అది మా పనోళ్ల కోసం నిర్మించిన సెక్యూర్డ్ భవనం : మాజీ మంత్రి పెద్దిరెడ్డి (Video)

ప్రయాగ్ రాజ్ మోనాలిసా ఇంటికి దర్శకుడు సనోజ్ మిశ్రా, సినీ ఆఫర్ కన్ఫర్మ్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ వాయిదాకు కారణం?

తర్వాతి కథనం
Show comments