Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాయిగా నవ్వాలంటే.. దంతాలను ఇలా పరిరక్షించుకోండి.. ఇవిగోండి చిట్కాలు

హాయిగా నవ్వడానికి అందమైన పళ్లు కావాలి. తిన్నది బాగా జీర్ణం కావడానికి నమిలే దంతాలు కావాలి. దంతాలు ఆరోగ్యంగా ఉంటేనే మాట్లాడేటపుడు, నవ్వినప్పుడు ఇతరులకు మంచి భావన కలుగుతుంది. ఇలా మానవదైనందిన జీవితానికి ద

Webdunia
సోమవారం, 18 జులై 2016 (15:10 IST)
హాయిగా నవ్వడానికి అందమైన పళ్లు కావాలి. తిన్నది బాగా జీర్ణం కావడానికి నమిలే దంతాలు కావాలి. దంతాలు ఆరోగ్యంగా ఉంటేనే మాట్లాడేటపుడు, నవ్వినప్పుడు ఇతరులకు మంచి భావన కలుగుతుంది. ఇలా మానవదైనందిన జీవితానికి దంతాలు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అటువంటి దంతాలు బాగా లేక‌పోతే మ‌నం ఆహారం తిన‌లేం. దీనికితోడు న‌లుగురిలోకి వెళ్లిన‌ప్పుడు న‌వ్వాల‌న్నా, వారితో మాట్లాడాల‌న్నా ఇబ్బందికరంగా ఉంటుంది. 
 
ఈ క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రు త‌మ దంతాల ప‌ట్ల జాగ్రత్తలు వహించాలి. ఒక్కోసారి దంతాలు వాటిలో ఇరుక్కుపోయే ఆహారం వ‌ల్ల‌, బాక్టీరియా వ‌ల్ల, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల దంతక్ష‌యానికి గుర‌వుతుంటాయి. దీంతో చిగుళ్లు కూడా దెబ్బతింటుంది. అయితే దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌డంతోపాటు చిగుళ్ల‌ను సంర‌క్షించుకున్న‌ప్పుడే దంతక్ష‌యం కూడా తగ్గుతుంది. ఈ క్ర‌మంలో చిగుళ్లను ఎలా సంరక్షించుకోవాలో తెల్సుకుందాం...
 
ఆయిల్ పుల్లింగ్ అంటే అందరికి తెలిసే ఉంటుంది. నువ్వుల నూనెను తీసుకుని వేడి చేసి దాన్ని నోట్లో వేసుకుని ఆయిల్ పుల్లింగ్ చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల దంతక్ష‌యంకాకుండా ఉంటుంది. గ్రీన్ టీని నిత్యం తీసుకుంటే ఈ సమస్య నుండి బయటప‌డ‌వ‌చ్చు. చిగుళ్ల స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. ఇన్‌ఫెక్ష‌న్ల బారిన పడకుండా కాపాడుతుంది.
 
యూక‌లిప్ట‌స్ ఆయిల్ నోటిలో చేరిన బ్యాక్టీరియాను పోగొడుతుంది. చిగుళ్ల స‌మ‌స్య‌ను త‌గ్గిస్తుంది. కొద్దిగా యూక‌లిప్ట‌స్ ఆయిల్‌ను తీసుకుని కొంత నీటిలో వేసి బాగా క‌ల‌పాలి. అనంత‌రం ఈ మిశ్ర‌మాన్ని బాగా పుక్కిలించాలి. రోజూ ఇలా చేస్తే త్వ‌ర‌లోనే దంతాలు, చిగుళ్ల స‌మ‌స్య‌లు పోతాయి.
 
కలబంద చిగుళ్ల సమస్యను ఇట్టే అరికడుతుంది. యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు వీటిలో అధికంగా ఉండడం వల్ల దంతాలు, చిగుళ్ల స‌మ‌స్యలు రాకుండా కాపాడుతుంది. ప్రతిరోజు కలబంద రసాన్నినోటిలో పోసుకుని పుక్కిలిస్తున్న‌ట్ట‌యితే దంతాలు, చిగుళ్ల స‌మ‌స్య‌ల‌న్నీ తొలగిపోతాయి.
 
యారో అనే మొక్క పూలను బాగా నలిపి చిగుళ్ల‌పై రాసుకోవాలి. యారోలో యాంటీ సెప్టిక్ గుణాలు పుష్క‌లంగా ఉన్నాయి. దీంతో దంతాలు, చిగుళ్ల స‌మ‌స్య‌లు త్వ‌ర‌గా త‌గ్గిపోతాయి. 

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments