Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రి పడుకునే ముందు క‌ర్జూరాలు తిని మంచి నీళ్లు తాగితే...?!!

కర్జూరాలు రోజూ ఆహారంలో తీసుకోవ‌డం వ‌ల్ల‌ యాక్టివ్‌గా, హెల్తీగా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. విటమిన్స్, ఎమినో యాసిడ్స్, క్యాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు రోజంతా ఎనర్జీటిక్‌గా ఉండటానికి సహాయపడతాయి. ఇవి శరీరానికి చాలా అమోఘమైన ప్రయోజనాలు అందిస్తాయి. రోజుకి కనీస

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (19:25 IST)
కర్జూరాలు రోజూ ఆహారంలో తీసుకోవ‌డం వ‌ల్ల‌ యాక్టివ్‌గా, హెల్తీగా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. విటమిన్స్, ఎమినో యాసిడ్స్, క్యాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు రోజంతా ఎనర్జీటిక్‌గా ఉండటానికి సహాయపడతాయి. ఇవి శరీరానికి చాలా అమోఘమైన ప్రయోజనాలు అందిస్తాయి. రోజుకి కనీసం 8 నుంచి 10 డేట్స్‌ని ఉదయాన్నే తినడం వల్ల శరీరానికి ప్రయోజనాలు అందుతాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి చర్మ సౌందర్యం నుంచి ఇమ్యునిటీ మెరుగుపరచడానికి, కంటిచూపుని మెరుగుపరచడానికి సహాయపడతాయి. రోజుకి 10 డేట్స్ తినడం వల్ల అమోఘమైన ప్రయోజనాలు పొందుతారు.
 
* గాయాలు అయినప్పుడు కొన్ని డేట్స్‌ని క్రష్ చేసి, పెరుగులో బాగా కలిపి తీసుకోవడం వల్ల వెంటనే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
* రాత్రి నిద్రపోవడానికి ముందు డేట్స్ తిని ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. అలాగే ఉదయాన్నే ఎనర్జిటిక్‌గా ఉంటారు.
* డేట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కాన్ట్సిపేషన్ నివారించడానికి సహాయపడుతుంది. అలాగే  జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహకరిస్తుంది.
* డేట్స్ అనీమియా నివారించడానికి ఎఫెక్టివ్‌గా సహాయపడతాయి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య దరిచేరదు.
* విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్స్ డేట్స్‌లో ఉండటం వల్ల కంటిచూపుని మెరుగుపరుస్తాయి.
* డేట్స్‌లో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల బీపీని కంట్రోల్ చేస్తాయి. కాబట్టి రెగ్యులర్‌గా డేట్స్ తినడం ఆరోగ్యానికి మంచిది.
* కర్జూరాలను ఫ్రూట్ సలాడ్ తోపాటు మిక్స్ చేసి తీసుకోవడం వల్ల న్యూట్రిషియంట్ వ్యాల్యూ పెరుగుతుంది.
* కర్జూరాల్లో షుగర్, ప్రొటీన్ ఉంటుంది. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి.
 
* కర్జూరాల్లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. 
* కర్జూరాలు తిన‌డం వ‌ల్ల గుండెజ‌బ్బుల‌ను దూరం చేస్తాయి. వీటిల్లో కొలెస్ట్రాల్ ఉండదు కాబట్టి  ఇవి గుండెకు మంచిది.
* కర్జూరాల్లో క్యాల్షియం ఎక్కువ మోతాదులో లభిస్తుంది. కాబట్టి ఇవి జాయింట్ పెయిన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కండరాలకు శక్తిని అందిస్తాయి.
 
* కర్జూరాలు చర్మానికి కూడా మంచిది.ఇందులో విటమిన్ బి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
* కర్జూరాల్లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి.ఇవి ఇన్ఫెర్టిట్స్ ని నివారించడానికి సహాయపడతాయి.
* డేట్స్ లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల యాక్నె, పింపుల్స్ ను నివారిస్తాయి.
* కర్జూరాలు, పాలు క‌లిపి తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తిని అందించి, ఇమ్యునిటీని మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులో ఉండే జింక్ ఇమ్యునిటీని మెరుగుపరచడానికి సహాయపడతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments