వర్షాకాలంలో వచ్చే దగ్గు, జలుబు.. వదిలించుకునే మార్గాలివే

Webdunia
శనివారం, 18 జులై 2020 (15:03 IST)
వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు అంత త్వరగా తగ్గవు. కాని ఇప్పుడున్న కరోన వైరస్ వలన సాధారణంగా వచ్చే దగ్గు, జలుబు, అయినాసరే ఎంతో భయాన్ని కలిగిస్తుంది. ఇలాంటి వైరస్‌ల బారిన పడకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. మన ఇంట్లో వాడే పదార్ధాలతోనే మనం దగ్గు, జలుబు తగ్గించుకునే అవకాశాలున్నాయి. అవేంటో చూద్దాం.
 
1. కరక్కాయను పగులగొట్టి చిన్న ముక్కను బుగ్గన ఉంచుకుని చప్పరిస్తూ ఆ రసాన్ని కొద్దికొద్దిగా మింగుతూ ఉంటే సాధారణంగా వచ్చే దగ్గు, జలుబు తగ్గిపోతుంది. చేదుగా, వగరుగా ఉండే కరక్కాయ రసం మంచి ఫలితాన్నే ఇస్తుంది.
 
2. గోరువెచ్చని నీటిలో కొద్దిగా యాలకుల పొడి, లవంగాల పొడి కలుపుకుని నెమ్మదిగా చప్పరిస్తూ తాగితే మంచి గుణం కనిపిస్తుంది.
 
3. ఒక అర చెంచా అల్లం రసంలో ఒక చెంచా చేనె కలుపుకుని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సేవిస్తూ ఉంటే దగ్గుతో పాటు దానివల్ల కలిగే ఆయాసం కూడా తగ్గిపోతుంది.
 
4. గోరువెచ్చని పాలల్లో కొద్దిగా యాలుకుల పొడి, మిరియాల పొడి కలుపుకుని రాత్రి పడుకునే ముందు తీసుకుంటే దగ్గు తగ్గి సుఖనిద్ర పడుతుంది. అలాగే మిరియాల కషాయం కూడా దగ్గుని, జలుబును తగ్గించడంలో సహాయపడుతుంది.
 
5. ఒక స్పూన్ తులసి ఆకుల రసానికి సమపాళ్లలో తేనె కలిపి వాడితే కఫం వల్ల వచ్చే దగ్గు తగ్గి ఉపశమనం కలుగుతుంది. లేదా తులసి ఆకులను నమిలినా మంచి ఫలితం ఉంటుంది.
 
6. శొంఠిని నీళ్లలో కలిపి కషాయంగా కాచి అందులో పటికబెల్లం కలుపుకుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం సేవిస్తూ ఉంటే దగ్గు, జలుబు, త్వరగా తగ్గుతుంది. అలాగే శొంఠితో కాచే కాఫీ, టీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.
  
7. కాఫీ, టీ త్రాగేవారు అందులో అల్లంను కూడా చేర్చితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
 
8. ఒక టీ స్పూన్ మునగ ఆకు రసాన్ని వారానికి మూడుసార్లు తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Telangana Speaker: ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం- సుప్రీంకోర్టు గడువు ముగింపు

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ద్విచక్ర వాహనంపై హోంమంత్రి అనిత పరిశీలన

AP Liquor Scam: రూ.3,200 కోట్ల ఏపీ మద్యం కుంభకోణం- 48 మందిపై కేసులు

Nara Lokesh: విద్యార్థులకు కరాటే నేర్పిస్తాం.. నారా లోకేష్

విడాకులు తీసుకున్న 38 ఏళ్ల మహిళతో 23 ఏళ్ల యువకుడు ఎఫైర్, కొత్త లవర్ రావడంతో...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Sirish and Nayanika: నయనిక రెడ్డితో అల్లు శిరీష్.. తారల సందడి

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

తర్వాతి కథనం
Show comments