Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనియాల పొడిని గ్లాసుడు నీటిలో వేసుకుని పసుపు కలిపి తాగితే...

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (10:01 IST)
ధనియాలు అంటే తెలియని వారుండరు. వీటిని అనేక రకములైన వంటలలో ఉపయోగిస్తుంటాము. ధనియాలు వంటలలోనే కాదండోయ్...... ఒక మంచి ఔషధంలా కూడా ఉపయోగపడతాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. ఎలాగో చూద్దాం. 
 
1. ధనియాలతో తయారుచేసే కషాయం వల్ల చాలా లాభాలున్నాయి. ధనియాలను  బాగా నీటిలో మరిగించి వడకట్టుకుని ఆ కషాయం తాగడం వల్ల వెంటనే జలుబు తగ్గిపోతుంది. అలాగే ధనియాలను రోజువారి తినే ఆహారంలో ఉండేటట్లు చూసుకోవడం వల్ల శరీరంలోని షుగర్ శాతం కూడా తగ్గుతుంది.
 
2. ధనియాల‌ను రోజూ తీసుకుంటే శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి. దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. 
 
3. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ధనియాల కషాయం తయారు చేసుకుని అందులో కాస్త పాలు, చక్కెర కలుపుకుని తాగడం వల్ల  మంచి నిద్రపడుతుంది. 
 
4. శరీరంలోని కొవ్వుని కరిగించడానికి కూడా ధనియాలు బాగా ఉపయోగపడతాయి. ధనియాలను మెత్తగా పొడిలాగా చేసుకుని అందులో కాస్త పసుపు కలుపుకుని దాన్ని నీటిలో కలుపుకుని తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది.
 
5. ధనియాలను తరచూ ఏదో ఒక రూపంలో ఆహారంలో చేర్చుకుంటే శృంగార శక్తి కూడా పెరుగుతుంది.
 
6. చర్మ సంరక్షణకు ధనియాలు బాగా ఉపయోగపతాయి. ధనియాలను మెత్తగా చూర్ణంలా చేసుకుని, ఆ మిశ్రమాన్ని ముఖంపై రాసుకోవడం వల్ల  ముఖంపై ఉండే మొటిమలు తగ్గుముఖం పడతాయి.
 
7. ధనియాలను ఏదో రకంగా రోజూ తీసుకుంటే షుగర్ వ్యాధిని అడ్డుకుంటుంది. అంతేకాకుండా టైఫాయిడ్‌ వచ్చినప్పుడు ధనియాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments