Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలంలో కోల్డ్ క్రీమ్ ఉపయోగాలు... పలువిధాలు

Webdunia
గురువారం, 20 నవంబరు 2014 (17:59 IST)
చలికాలంలో వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండటం వలన చర్మం పొడిబారి పోతుంది. దాంతో పగుళ్లు రావడం, దురదలు వంటి సమస్యలు చాలామందిని వేధిస్తాయి. దీనికి పెట్రోలియమ్ జెల్లీ, బాడీ లోషన్ రాయడం వల్ల చాలా మందికి సమస్య తీరిపోతుంది. అయితే కొద్దిమందిలో చర్మ సమస్యలు తీవ్రంగా మారతాయి. అటువంటి వారు ప్రతి రోజూ రాత్రి పడుకోబోయే ముందు కోల్డ్ క్రీమ్ రాసుకున్నారంటే శరీరంలో పగుళ్లు ఏర్పడవు. చర్మం మృదువుగా తయారవుతుంది. 
 
ముఖ్యంగా చలికాలంలో పెదవులు ఎక్కువ పగిలిపోతాయి. రాత్రి పడుకునే ముందు పెదాలకు మీగడ లేదా వెన్న రాసుకుంటే మెత్తబడతాయి. చలికాలంలో పెదవులు పగిలిపోయినట్లు అనిపిస్తే... నాలుకతో తడి చేసుకోకూడదు. అలా చేస్తే పెదవులు ఎండిపోయి చర్మం మొద్దుబారిపోతుంది. అందువల్ల పెదాలకు కోల్డ్ క్రీమ్ రాసుకున్నారంటే పగిలిపోకుండా మృతువుగా ఉంటాయి. 
 
చలికాలంలో చేతులపైన కాళ్ళపైన పగుళ్ళు అధికంగా ఏర్పడుతాయి. ఇప్పుడు కనుక సరైజ జాగ్రత్తలు తీసుకోకపోతే తర్వాత ముడుతలు, చర్మం మీద గీతలు అలాగే ఉండిపోతాయి. కాబట్టి కాళ్ళు చేతులకు కూడా కోల్డ్ క్రీమ్ రాయండి.
 
సాధారణంగానే కొందరి పాదాలలో పగుళ్లు ఉంటాయి. అవి చలికాలంలో మరింత పగిలి, బీటవారిపోతాయి. కొన్ని సందర్భాల్లో రక్తం కూడా కారుతుంది. అటువంటి సమస్యతో బాధపడేవారు. రాత్రి పడుకోబోయే ముందు పాదాలను శుభ్రంగా నీటితో కడిగి కోల్డ్ క్రీమ్ రాసుకుని పడుకున్నారంటే పాదాల పగుళ్లు కొంత మేరకు తగ్గుతాయి. 
 
ఫేస్ క్రీములు, బాడీలోషన్ల గురించి చాలా మందికి తెలుసు. తెలియని వారుంటే వారు, చలికాలంలో కోల్డ్ క్రీమ్ రాయడం వల్ల శరీరానికి మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. శీతాకాలంలో పురుషులు షేవింగ్ క్రీమ్‌కు బదులు కోల్డ్ క్రీమ్‌ను ఉపయోగించవచ్చు. 

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments