స్త్రీలకు కొబ్బరి ఎంతో మంచిది.... కొబ్బరితో ఆరోగ్యం లాభాలేంటి?

కొబ్బరి చాలా బలమైన పదార్థం. పచ్చి కొబ్బరి, ఎండుకొబ్బరి రెండింటినీ ఆహార పదార్థాలలో వాడుతుంటారు. కొబ్బరిని అధిక మోతాదులో తినరాదు. కొబ్బరి దగ్గు, నెమ్ము ఆయాసాలను కలిగిస్తాయి. మూత్రకోశ వ్యాధులకు కొబ్బరి చ

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2016 (15:57 IST)
కొబ్బరి చాలా బలమైన పదార్థం. పచ్చి కొబ్బరి, ఎండుకొబ్బరి రెండింటినీ ఆహార పదార్థాలలో వాడుతుంటారు. కొబ్బరిని అధిక మోతాదులో తినరాదు. కొబ్బరి దగ్గు, నెమ్ము ఆయాసాలను కలిగిస్తాయి. మూత్రకోశ వ్యాధులకు కొబ్బరి చాలా పనిచేస్తుంది. వేడిని కలిగిస్తుంది. వీర్యవృద్ధిని, లైంగిక శక్తిని పెంచుతుంది. హృదయ వ్యాధులు కలిగినవారికి ఎంతో మేలు చేస్తుంది. బలాన్ని కలిగిస్తుంది. చలువ చేస్తుంది. వేడినీ, వాతాన్ని తగ్గిస్తుంది. ఆకలిని పెంచుతుంది. దాహాన్ని తగ్గిస్తుంది. తేలికగా అరుగుతుంది. శుక్రవృద్ధిని చేస్తుంది కొంచెం మలబద్థకాన్ని కలిగిస్తుంది.
 
కొబ్బరి కల్లు చిక్కగా రుచిగా ఉంటుంది. ఆకలిని పుట్టించి చలువ చేస్తుంది. మేహశాంతిని కలిగిస్తుంది. వీర్యపుష్టిని బలమును చేకూరుస్తుంది. మలబద్దకాన్ని అతిసార రోగమును పోగొట్టును. మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది. గర్భిణీ స్త్రీలు వారమునకు 2-3 దినములు 3 ఔన్సుల కల్లును త్రాగించిన పుట్టబోవు పిల్లలు ఎర్రగా, తెల్లగా పుట్టెదరు. వేడి శరీరం గల వారికి నరములకు బలము నిచ్చును. మూత్ర సంచిలోని వాతమును నొప్పిని తగ్గించును. కాక పెట్టడం, బొడ్డు సెగ చేయుట మొదలగు వానిని తగ్గించును.
 
కొబ్బరి తురుము, పసుపు, కలిపి కట్టిన నీరుగారు కురుపులు, ముడ్డివద్దనున్న పుండు వెంటనే మాయమగును. లేత కొబ్బరి కాయలోని నీరు, వాంతిని పోగొట్టును. పైత్యమును తగ్గించును. విరేచనమును చేయును. క్రిములను చంపును, ముదిరిన కొబ్బరికాయ నీరు దగ్గును, కళ్ళెను పెంచును. లేత కొబ్బరి, అరటిపండు, పాలు కలిపి ప్రతిరోజూ చిన్నపిల్లలకు తినిపిస్తుంటే మంచి బలమైన ఆహార పదార్థముగా పనిచేస్తుంది. 
 
కొబ్బరిపాలు, బొప్పాయి పాలు, కొంచెం తేనె కలిపి ప్రతిరోజు రాత్రి సమయంలో ఒక స్పూను తింటుంటే దగ్గు, విరేచనములు తగ్గుతాయి. ఉదయం పూట ఒక గ్లాసు కొబ్బరి పాలు త్రాగి తదుపరి నాలుగు గంట లాగి ఒక చెంచా ఆముదం త్రాగితే కడుపులో నున్న బద్దెపురుగులు పడిపోతాయి. ఎండు కొబ్బరిలో కొంచెం పంచదార కలిపి తింటుంటే ప్రేగులలో నున్న కురుపులు మానిపోతాయి. మీగడలాంటి లేత కొబ్బరిని ప్రతిరోజూ ముఖంపైన వేసి రుద్దుతుంటే మొటిమలు తగ్గి ముఖం నునుపు దేలుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

7,096 శునకాలకు కు. ని శస్త్రచికిత్సలతో పాటు వ్యాక్సినేషన్

ఉర్దూ నేర్పిన ప్రిన్సిపాల్‌ను చెంపపై కొట్టిన బీజేపీ నేత మందుల బాలు అరెస్ట్

వడ్డీకి పదిలక్షలు.. ఇంట్లో నిధులని మోసం.. దంపతుల ఆత్మహత్య.. ఐదు నెలల పసికందు?

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు... రైలు సర్వీసులు రద్దు.. 22 వేల మంది వరద బాధితులు

సీఎం విజయ్ కీలక నిర్ణయం : తమిళనాడులో పరుగులు పెట్టనున్న ఏసీ బస్సులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటి దివ్య సురేష్‌కు చేదు అనుభవం.. భద్రత ఎక్కడ ఉన్నాయి? (video)

Samantha: మహిళా సూపర్ స్టార్లు రావాలంటే నిర్మాతలు ముందుకు రావాలి : సమంత రూత్ ప్రభుv

Vishal: శివ చూశాక దర్శకుడిగా మారాలని ఫిక్స్ అయ్యాను : విశాల్

Virat Karna: చలికి శరీరం ఫ్రీజ్ అయింది - నాగసాధు మేకప్ కి ఆరు గంటలు పట్టేది.: విరాట్ కర్ణ

Brahmanandam: హ్యాంగ్‌మెన్ లాంటి ఆలోచన రావడమే గొప్ప విషయం :డా. బ్రహ్మానందం

తర్వాతి కథనం