Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ గ్లాసుడు బత్తాయి రసం తాగితే..

బత్తాయి రసంలో ఆరోగ్య ప్రయోజనాలెన్నో దాగివున్నాయి. స్వీట్ లెమన్, మోసంబి అని పిలువబడే ఈ బత్తాయిలో విటమిన్ సి పుష్కలంగా వుంది. ఇది శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది.

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2017 (16:31 IST)
బత్తాయి రసంలో ఆరోగ్య ప్రయోజనాలెన్నో దాగివున్నాయి. స్వీట్ లెమన్, మోసంబి అని పిలువబడే ఈ బత్తాయిలో విటమిన్ సి పుష్కలంగా వుంది. ఇది శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. బత్తాయిలోని పీచు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎముకలకు బలాన్నిస్తుంది. యాంటీ-ఏజింగ్ ఏజెంటుగా పనిచేస్తుంది. 
 
బత్తాయిలో పొటాషియం, ఫాస్పరస్, మినరల్స్ వున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు బత్తాయి రసాన్ని రోజూ ఒక గ్లాసుడు తీసుకోవచ్చు. బత్తాయి రసాన్ని తీసుకోవడం ద్వారా అలసట మాయమవుతుంది. 
 
రక్తంలోని ఎరుపు కణాలను ఇది వృద్ధి చేస్తుంది. రక్తహీనతకు చెక్ పెడుతుంది. పిల్లల్లో పెరుగుదలకు బత్తాయి తోడ్పడుతుంది. వృద్ధుల్లో కీళ్ల నొప్పులను నయం చేస్తుంది. 30 దాటిన మహిళలు రోజు ఒక గ్లాసు బత్తాయి రసం తాగాల్సిందే. జ్ఞాపకశక్తినిని ఇది పెంపొందింపజేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్థులు అరగ్లాసు బత్తాయి రసం, ఆరు స్పూన్ల ఉసిరి రసాన్ని చేర్చి తీసుకోవాలి. తేనెను ఓ స్పూన్ రుచి కోసం కలుపుకోవచ్చు. బత్తాయిలోని లో కేలరీలు బరువును తగ్గిస్తాయి. కంటికి మేలు చేసే బత్తాయి.. చర్మ, కేశ ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments