Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లి కాడల వల్ల కలిగే ప్రయోజనాలు

Webdunia
శనివారం, 10 ఆగస్టు 2019 (15:16 IST)
ఉల్లికాడల్లోని ఎ, సి విటమిన్లు రోగనిరోధక వ్యవస్థను శక్తిమంతం చేస్తాయి. ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడతాయి. వీటిలో ఫైబర్, ఎ, బి,సి విటమిన్లు, ఫోలేట్‌తో పాటు పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటి లవణాలు అధికంగా ఉంటాయి.
వీటిలో సలాడ్స్, సూప్‌లోనే కాకుండా కూర వండినా రుచిగా ఉంటుంది. ఇవి శరీరానికి సూక్ష్మపోషకాలను అందించడమే కాదు జీవక్రియల్ని నియంత్రిస్తాయి కూడా. 
 
వీటిలో కావల్సినంత ఫైబర్ లభిస్తుంది. మధుమేహంతో బాధపడేవారికి ఉల్లికాడలు మంచి డైట్. 
అల్లిసిన్ అనే రసాయనం చర్మ ముడతలు పడకుండా చూస్తుంది. 
 
ఉల్లిపొరకలోని సల్ఫర్ రక్త పీడనాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు ఇన్సులిన్ ఉత్పత్తి పెంచి, తద్వారా రక్తంలో చక్కెర నిల్వలు పెరగకుండా చూస్తుంది.
 
వీటిలో లభించే అలైల్ సల్ఫైడ్ ఫ్రీరాడికల్స్ బయటకు పంపుతుంది. కేన్సర్ కణాలను ఉత్పత్తి చేసే ఎంజైమ్‌ల విడుదలను నిలిపివేస్తుంది. 
 
ఉల్లికాడల్లోని కె,సి విటమిన్లు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఈ కాలంలో సాధారణంగా వచ్చే జలుబు, దగ్గును నివారిస్తాయి.
 
ఉల్లి పొరకలో కంటి ఆరోగ్యానికి మేలు చేసే కెరొటినాయిడ్స్, ఎ విటమిన్ అధికంగా ఉంటాయి. వీటిలోని పీచు పదార్థం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments