బాదంతో మేలెంతో తెలుసుకోండి.. చర్మానికి కాంతి.. ఎముకల వ్యాధులకు చెక్!

బాదం పప్పులో విటమిన్ ఇ, కాపర్, మెగ్నీషియం, ఎక్కువ మోతాదులో ప్రోటీన్లు ఉంటాయి. బాదం గింజలలోని పీచు, యాంటీ యాక్సిడెంట్‌లు గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. బాదంలోని రిబోఫ్లేవిన్, ఎల్- కామిటైన్‌లు

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2016 (11:12 IST)
బాదం పప్పులో విటమిన్ ఇ, కాపర్, మెగ్నీషియం, ఎక్కువ మోతాదులో ప్రోటీన్లు ఉంటాయి. బాదం గింజలలోని పీచు, యాంటీ యాక్సిడెంట్‌లు గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. బాదంలోని రిబోఫ్లేవిన్, ఎల్- కామిటైన్‌లు మెదడుకు పోషకాలుగా పనిచేస్తాయి. కాబట్టి ఇవి మెదడును చురుగ్గా ఉంచుతాయి. వార్ధక్యంలో ఎదురయ్యే అల్జీమర్స్ వ్యాధిని నివారిస్తాయి.
 
పిల్లలకు రోజూ రెండు లేదా మూడు బాదం గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తినిపిస్తే మంచిది. బాదం తింటే దేహంలో కొవ్వు స్థాయులు పెరుగుతాయనే అపోహ చాలా బలంగా ఉంది. కానీ నిజానికి ఇది పూర్తిగా అవాస్తవం. ఇందులోని ఫ్యాటీ యాసిడ్‌ల వల్ల దేహ నిర్మాణానికి, జీవక్రియలకు అవసరమైన కొవ్వు సమృద్ధిగా లభిస్తుంది. ఇవి దేహంలోని కొలెస్ట్రాల్ స్థాయులను సమన్వయం చేస్తాయి. 
 
బాదం గింజలలోని సూక్ష్మ పోషకాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. నరాల వ్యవస్థను శక్తిమంతం చేస్తాయి. రక్తాన్ని వృద్ధి చేస్తాయి. దంతాలు, ఎముకలను గట్టిపరుస్తాయి. ఎముకల వ్యాధులను నివారించవచ్చు. చర్మం కాంతివంతమవుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వంటగదిలో ప్రమాదానికి గురైన వధువు, ఆస్పత్రిలో పెళ్లి చేసుకున్న వరుడు, వీడియో

భగీరథ్‌ను పోలీసులకు అప్పగించాం.. కేంద్ర మంత్రి బండి సంజయ్

వావ్, క్యాంపస్ సెలక్షన్స్‌లో విజయవాడ విద్యార్థినికి రూ. 48 లక్షల ప్యాకేజీ

సీన్ రివర్స్: ప్రియుడు డబ్బులివ్వలేదు.. భర్త సాయంతో చంపి డ్రమ్ములో కుక్కి డ్రైన్‌లో పడేసింది

బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు : బాధితురాలి వాంగ్మూలం నమోదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

Kenisha: జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్‌ కట్

Nag Aswin: సింగీతం గారి స్టయిల్ లో సింగ్ గీతం ఫన్ సినిమా :నాగ్ అశ్విన్

Regina Cassandra: ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో నిండిన కథగా మరీచిక ట్రైలర్

చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా 350కి పైగా టైటిల్స్‌ని డిజైన్ చేశా : పురుష: దర్శకుడు వీరు వులవల

తర్వాతి కథనం
Show comments