Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉబ్బసం, ఆస్త్మా అదుపు ఇలా చేయొచ్చు....

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2016 (21:03 IST)
ఆస్తమా రోగులకు కష్టకాలం... చలికాలం. చల్లని గాలికి దుమ్ము, పొగలు తోడవడంతో ఆస్తమా తీవ్రమవుతుంది. కాబట్టి శీతాకాలంలో ఆస్తమాను అదుపులో ఉంచేందుకు జాగ్రత్తలు పాటించాలి. అలాగని మిగతా కాలాల్లో రాదని కాదు. వారికి సరిపడని వాతావరణ పరిస్థితి ఏర్పడితే వెంటనే సమస్య మొదలవుతుంది. దీన్ని నిరోధించేందుకు...
 
ఇల్లు తుడవాలి: ఊడిస్తే ధూళి రేణువులు గాల్లోకి లేచి శ్వాసనాళాల్లోకి చేరుకునే ప్రమాదం ఉంది. కాబట్టి తడి బట్టతో ఇల్లు తుడవాలి.
వ్యాక్యూమ్‌ క్లీనర్‌ : చీపుర్లకు బదులుగా వ్యాక్యూమ్‌ క్లీనర్‌ ఉపయోగించి నేల మీద దుమ్మును తొలగించాలి.
కర్టెన్లు శుభ్రం చేయాలి: కర్టెన్లలో దుమ్ము, పుప్పొడి రేణువులు అతుక్కుని ఉంటాయి. అందుకే వీటిని క్రమం తప్పకుండా ఉతకాలి.
 
కార్పెట్లు వాడొద్దు : ఇంట్లోని కార్పెట్లను మడిచి అటక ఎక్కించాలి. లేదంటే వాటిలో దుమ్ము, పుప్పొడి ఇరుక్కుని వాటి మీద నడిచినప్పుడల్లా గాల్లోకి లేస్తాయి.
క్లీనర్స్‌ వద్దు : నేల శుభ్రం చేసే క్లీనర్స్‌లోని రసాయనాలు ఆస్తమాను పెంచుతాయి.
ఇంటికి పెయింట్లు : ఇంటికి పెయింట్లు వేస్తున్నప్పుడు ఆస్తమా పేషెంట్లను దూరంగా ఉంచాలి. వీటిలోని రసాయనాల వల్ల ఉబ్బసం పెరుగుతుంది.
 
ఇమ్యునాలజిస్ట్‌ను కలవాలి : ఆస్తమాకు కారణమయ్యే అలర్జెన్స్‌ను గుర్తించటం కోసం ఇమ్యునాలజిస్ట్‌ను కలిసి టెస్ట్‌ చేయించుకోవాలి.
భావోద్వేగాల అదుపు : కొన్నిసార్లు బాధ, దుఃఖం, ఆవేశం లాంటి భావోద్వేగాలు కూడా ఆస్తమాను పెంచుతాయి. కాబట్టి భావోద్వేగాలను అదుపు చేసుకోవాలి.
 
ఇన్‌హేలర్స్‌ : వీటిని ఎప్పుడూ చేతికి అందేంత దగ్గర్లో ఉంచుకోవాలి. పిల్లలు వాడుతుంటే కనుక వాళ్లకు బడిలో ఆస్తమా అటాక్‌ వచ్చినప్పుడు ఇన్‌హేలర్స్‌ ఎలా ఉపయోగించాలో వాళ్ల టీచర్‌కు చెప్పాలి.
సాఫ్ట్‌ టాయ్స్‌ వద్దు : అలర్జీ ఉన్న పిల్లలు దుమ్ము ఇరుక్కునే అవకాశం ఉండే సాఫ్ట్‌ టాయ్స్‌తో ఆడకూడదు.
పెంపుడు జంతువులు : ఆస్తమా పేషెంట్లు ఉన్న ఇంట్లో పెంపుడు జంతువులను పెంచకూడదు.
 
ఆయిల్‌ మసాజ్‌ : క్రమం తప్పక సువాసన లేని నూనెతో మసాజ్‌ చేయించుకుంటూ ఉండాలి. 
జంక్‌ ఫుడ్‌ తినొద్దు : కూల్‌డ్రింక్స్‌, వేపుళ్లు, పచ్చళ్లు, పెరుగును తినకూడదు. మరీముఖ్యంగా రాత్రివేళ వీటికి దూరంగా ఉండాలి.
ఫుడ్‌ లిస్ట్‌ : అలర్జీకి కారణమయ్యే పదార్థాలేవో తెలుసుకుని వాటి లిస్ట్‌ తయారుచేయాలి. ఆ పదార్థాలకు దూరంగా ఉండాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Abu Saifullah: లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్‌ అరెస్ట్

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

Show comments