Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక చెంచాడు గోరింటాకు రసాన్ని తాగితే ఏమవుతుంది?

తెలుగువారు కన్నెపడుచుల చేతిపంట గోరింట ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఆడపిల్లలంతా ముందు గోరంట కోసం ఎదురు చూస్తూ వుంటారు. ముఖ్యంగా యుక్తవయస్కులు అయిన వారు, పిల్లలు ఆషాఢ మాసంలో పుట్టింటికి వచ్చిన కొత్త పెళ్ళికూతుళ్ళు గోరింటాకును ఆనందంగా పెట్టుకొనే వారు. ఇప్ప

Webdunia
సోమవారం, 10 జులై 2017 (20:15 IST)
తెలుగువారు కన్నెపడుచుల చేతిపంట గోరింట ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఆడపిల్లలంతా ముందు గోరంట కోసం ఎదురు చూస్తూ వుంటారు. ముఖ్యంగా యుక్తవయస్కులు అయిన వారు, పిల్లలు ఆషాఢ మాసంలో పుట్టింటికి వచ్చిన కొత్త పెళ్ళికూతుళ్ళు గోరింటాకును ఆనందంగా పెట్టుకొనే వారు. ఇప్పుడు గోళ్ళకు కృత్రిమంగా తయారుచేసిన రంగుల్ని, గోరింటాకును వాడుతున్నారు. 
 
ఒకప్పుడు గోరంటాకునే ఆందంగా గోళ్ళకు పెట్టుకొనేవారు. గోరింటాకులో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. వేళ్ళ మధ్య ఇన్‌పెక్షన్ వచ్చినపుడు, గోరు పుచ్చిపోతుంటే తరచుగా గోరింటాకు నూరి పెట్టుకుంటే వ్యాది తగ్గిపోతుంది. అరికాళ్ళు మంటగా ఉన్నపుడు గోరింటాకును మెత్తగా నూరి వాటిపై వ్రాస్తే అరికాళ్ళమంట తగ్గుతుంది.
 
వేడిచేసినపుడు వచ్చే సెగ గడ్డలు వచ్చినపుడు ఈ సమయంలో గోరంటాకును మెత్తగా నూరి సెగ గడ్డలపైన రాస్తే గడ్డలు పగిలి చీము బయటకు వచ్చి నొప్పి తగ్గుతుంది. పుండు కూడా త్వరగా మానుతుంది. కీళ్ళనోప్పులుంటే గోరింటాకును నూరి కీళ్ళకు పట్టు వేస్తే తగ్గుతుంది.
 
మూత్రము వెంట వీర్యము పోయినపుడు గోరింటాకు రసాన్ని రోజుకు ఒకసారి ఒక చిన్న చెంచాడు త్రాగుతుంటే తగ్గుతుంది. తలలో చుండ్రువున్నా, జుట్టు రాలిపోతున్నా, చిన్న వయస్సులో వెంట్రుకలు తెల్లబడుతున్నా, జుట్టు వత్తుగా పెరగాలన్నా, గోరింటాకును వాడటం మంచిది.
 
గోరింటాకును మెత్తగా నూరి ఒక ఇనుప మూకుడులో రాత్రంతా నానబెట్టి తెల్లవారాక తలకు పట్టించాలి. తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టులో వున్న సమస్యలను నివారించవచ్చు. హెయిర్ డైలు వాడవలసిన అవసరం రాదు. గోరింటాకును వాడడం వలన చేతులుకు అందంమే కాక జుట్టు కూడా అందంగా తయారవుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

తర్వాతి కథనం
Show comments