Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాప్సికమ్ తింటుంటాము కానీ అందులో ఏముందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2023 (21:56 IST)
కూరగాయల్లో క్యాప్సికమ్ కూడా ప్రత్యేకమైనది. దీనిని ఏదో వెజిటబుల్ రైస్, ఫ్రైడ్ రైస్, మసాలా కూరల్లో వాడుతుంటారు. కానీ క్యాప్సికమ్ తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవేంటో తెలుసుకుందాము.
 
క్యాప్సికమ్ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్యాప్సికమ్‌లో జియాక్సాంటిన్- లుటిన్ ఉండడమే కారణం.
 
క్యాప్సికమ్‌లో ఐరన్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతను నివారిస్తుంది.
 
క్యాప్సికమ్‌లోని విటమిన్ బి6, మెగ్నీషియం, సోడియం విటమిన్లు నరాల పనితీరుకు మేలు చేస్తాయి.
 
క్యాప్సికమ్‌లో వున్న యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రయోజనాలు కొన్ని రకాల క్యాన్సర్‌లను నివారిస్తాయి.
 
క్యాప్సికమ్‌లో విటమిన్ సి చాలా ఎక్కువ కనుక రోగనిరోధక శక్తిని పెంపొదిస్తుంది.
 
క్యాప్సికమ్‌లో మాంగనీస్ ఉంటుంది కనుక ఇది ఎముక మృదులాస్థి, ఎముక కొల్లాజెన్ ఏర్పడటానికి దోహదం చేస్తుంది.
 
ఆరోగ్యకరమైన, అందమైన కేశాల కోసం క్యాప్సికమ్ తింటే మంచిదని నిపుణులు చెపుతారు.
 
క్యాప్సికమ్ అధిక మోతాదులో తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు కనుక మితంగా తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments