Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో ఎసిడిటీ వస్తే ఏం చేయాలి?

ఈరోజుల్లో చాలామంది ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు. దీనిని నివారించటానికి ఆహారంలో మార్పు చేస్తే సరిపోతుంది. 1. పుచ్చకాయల్లో పీచు పదార్థాలు, యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎసిడిటీ తలెత్తకుండా అడ్డుకుంటాయి. ఈ పండులోని చల్లదనం, నీటి కారణ

Webdunia
శుక్రవారం, 30 మార్చి 2018 (17:54 IST)
ఈరోజుల్లో చాలామంది ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు. దీనిని నివారించటానికి ఆహారంలో మార్పు చేస్తే సరిపోతుంది.
 
1. పుచ్చకాయల్లో పీచు పదార్థాలు, యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎసిడిటీ తలెత్తకుండా అడ్డుకుంటాయి. ఈ పండులోని చల్లదనం, నీటి కారణంగా శరీరంలో హైడ్రేడ్ సమస్య తలెత్తదు. పిహెచ్ పరిమాణాన్ని కూడా తగ్గిస్తుంది. యాపిల్, బొప్పాయి వంటి వాటిల్లో కూడా పీచుపదార్థాలు బాగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఎసిడిటీ తలెత్తకుండా కాపాడతాయి.
 
2. వేసవిలో కొబ్బరి నీళ్లు తాగితే ఎంతో మంచిది. ఇది ప్రకృతిసిద్ధమైన డ్రింక్. ఇందులో క్లీనింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయి. కొబ్బరి నీళ్లలో కూడా పీచు పదార్థాలు సమృద్ధిగా ఉన్నాయి. కొబ్బరి నీళ్లను నిత్యం తాగడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది.
 
3. చల్లటి పాలు తాగితే కూడా ఎసిడిటీ సమస్య పోతుంది. స్టొమక్‌లోని యాసిడ్‌ని పాలు పీల్చేసుకుంటాయి. దీంతో కడుపులో మంట ఉండదు. కడుపులో ఎసిడిటీతో బాధపడుతున్నా, ఎసిడిటీ కారణంగా హార్ట్ బర్న్ తలెత్తినా పంచదార వేసుకోకుండా చల్లటి పాలు తాగాలి.
 
4. అరటిపండు ఎసిడిటీ మీద బాగా పనిచేస్తుంది. అరటి పండులోని పొటాషియం స్టొమక్ అంచుల్లో మ్యూకస్‌ను ఉత్పత్తి చేసి శరీరంలోని పిహెచ్ ప్రమాణాన్ని తగ్గిస్తుంది. అరటిపళ్లలో పీచుపదార్ధాలు కూడా బాగా ఉన్నాయి. అందుకే వేసవిలో మిగలపండిన అరటిపండును తింటే ఎసిడిటీ సమస్య తలెత్తదు.

సంబంధిత వార్తలు

అధికారంలోకి వచ్చిన కూటమి.. తామే గెలిచామన్న సంతోషంలో ప్రజలు : నారా భువనేశ్వరి

పవన్ కోసం పరుగులు తీసిన యువతి.. కాన్వాయ్‌తో పోటీ పడి రన్ (video)

ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. 24న జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా?

వ్యవస్థను మోసం చేసిన వ్యక్తి డాక్టర్ అయితే సమాజానికి మరింత హాని : సుప్రీంకోర్టు

తీహార్ జైలులో కవితను కలిసిన బీఆర్ఎస్ నేతలు

పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో అశ్విన్ బాబు శివం భజే చిత్రం

దర్శకుడు తేజ ఆవిష్కరించిన పోలీస్ వారి హెచ్చరిక టైటిల్ లోగో

ఆ గాయంతోనే నింద షూటింగ్ చేశాను : హీరో వరుణ్ సందేశ్

సీతా కళ్యాణ వైభోగమే ట్రైలర్, పాటలు బాగున్నాయన్న సీఎం రేవంత్ రెడ్డి

ఏ వైలెంట్ టేల్ అఫ్ బ్లడ్ షెడ్: హనీ రోజ్ రేచెల్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments