Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగి పాత్రలో మంచినీళ్లు తాగితే....

రాగి పాత్ర... అంటే ఏంటి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు ఈ రోజుల్లో. ఎందుకంటే... ఇపుడంతా ప్లాస్టిక్, గాజు గ్లాసులే ఎక్కువ‌గా వాడుక‌లో ఉన్నాయి. వీలైతే పేప‌ర్ గ్లాసులు కూడా వాడేస్తున్నారు. కానీ, రాగి పాత్ర‌లో మంచినీళ్ళు తాగితే ఎంత మంచిదో తెలుసా? ఇది బ్యాక్

Webdunia
మంగళవారం, 7 జూన్ 2016 (17:21 IST)
రాగి పాత్ర... అంటే ఏంటి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు ఈ రోజుల్లో. ఎందుకంటే... ఇపుడంతా ప్లాస్టిక్, గాజు గ్లాసులే ఎక్కువ‌గా వాడుక‌లో ఉన్నాయి. వీలైతే పేప‌ర్ గ్లాసులు కూడా వాడేస్తున్నారు. కానీ, రాగి పాత్ర‌లో మంచినీళ్ళు తాగితే ఎంత మంచిదో తెలుసా? ఇది బ్యాక్టీరియాను అరిక‌డుతుంద‌ని ప‌రిశోధ‌న‌లో తేలింది.
 
రాబ్ రీడ్ అనే మైక్రో బయాలజిస్ట్ ప్లాస్టిక్, మట్టి, రాగి పాత్రల‌లో విరోచనాకారి అయిన బాక్టీరియాతో కూడిన నీటిని వాటిలో ఉంచి, 48 గంటల తరువాత ఆ నీటిపై ప‌రిశీల‌న చేశాడు. రాగి పాత్రలో ఉంచిన నీళ్ళ‌లో బాక్టీరియా శాతం తగ్గింది. అదే ప్లాస్టిక్, మ‌ట్టి పాత్రలో ఉన్న బాక్టీరియా శాతం రెండింతలు అయ్యింది.
 
రాగి పాత్ర వ‌ల్ల ఉప‌యోగాలు:
* జీర్ణ వ్యవస్థకు మంచిది: రాగి పాత్రలో నీరు తాగడం వల్ల అసిడిటీ, గ్యాస్, అజీర్ణం వంటివి తగ్గడమే కాకుండా, కడుపుకి హాయి కలిగించి, ప్రాణాంతకరమైన బాక్టీరియాను కూడా నిర్మూలిస్తుంది. కిడ్నీ, లివర్ చురుకుగా పనిచేయడంలో తోడ్పడుతుంది.
 
* బరువు తగ్గిస్తుంది: మనం అధిక బరువు తగ్గడానికి రకరకాల పండ్లు, కూరగాయలు వంటివి తింటూ ఉంటాం. కాని వాటివల్ల వచ్చే ప్రయోజనాల కన్నా, వాటికి ఖర్చుపెట్టిన డబ్బు వ్యర్ధం అయిందన్న దిగులే ఎక్కువ. రాగి పాత్రలో నీరు తాగడం వల్ల అది జీర్ణ వ్యవస్థను సరైన మార్గంలో నడిచేలా చేసి, కొవ్వు మరియు ఇతర చెడు బాక్టీరియాను శరీరం నుండి తీసేస్తుంది.
 
* గాయాలను త్వరగా నయం చేస్తుంది: రాగిలో ఉండే యాంటి-బాక్టీరియాతత్వం శరీరంలోని అనేక గాయాలను వేగంగా నయం చేయడంతోపాటు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచి, శరీరంపై ఉన్న గాయాలనే కాకుండా లోపల ఉన్న గాయాలను, ముఖ్యంగా కడుపులో ఉన్న గాయాలను కూడా తగ్గించడంలో సహాయం చేస్తుంది.
 
* వయసును దాచేస్తుంది: కొంతమంది ఆరోగ్యపరంగా ఎంత చురుకుగా ఉన్నా వారి వయసుకు మించి కనిపిస్తూ ఉంటారు. ఈ సమస్య నుంచి బాధపడేవారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారు రాగి నుండి ఉత్పత్తి అయ్యే ప్రయోజనాలతో వారి సమస్య నుండి విముక్తి ల‌భిస్తుంది. ముఖంపై ఉన్న మచ్చలు, ముడతలు వంటివి రాగి తగ్గిస్తుంది.
 
* క్యాన్సర్ వ్యాధి నుండి పోరాడుతుంది: రాగిలో ఉండే యాంటి-ఆక్సిడెంట్స్ క్యాన్సర్ వంటి ప్రాణాంతకరమైన రోగాల నుండి కాపాడుతాయి. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వారు చేసిన పరిశోధనాల ప్రకారం రాగి క్యాన్సర్‌ను ఎలా రానివ్వకుండా చేస్తుందో కనుగొనలేకపోయారు. కాని రాగి నిరంతరం క్యాన్సర్ వ్యాపింపజేసే వైరస్‌ను అడ్డుకోవడంలో తోడ్పడుతుందని ఆ పరిశోధనల్లో తేలింది.
 
* మెదడును మెరుగుపరుస్తుంది: మన శరీర భాగంలో అతి ముఖ్యమైన అవయవాల్లో ఒకటి మెదడు. మనిషి శరీరంలో ప్రతీ ఒక్క భాగానికి మెదడుతో సంబంధాలు కలిగి ఉంటాయి. మెదడు నుండి ఆయా భాగాలకు న్యురాన్ల ద్వారా సంకేతాలు అందుతాయి. ఈ న్యురాన్లను మైలిన్ తొడుగు కాపాడుతుంది. రాగిలో ఉండే విలువైన పదార్థాలు ఈ మైలిన్ తొడుగును కపాడంతోపాటు, మెదడును చురుకుగా, యవ్వనంగా తయారుచేస్తుంది. 
 
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారి ప్రకారం రాగిని రోజుకు 12మి.గ్రా కన్నా ఎక్కువ తీసుకునే అవసరం లేదు అంటే రాగి పాత్రలో కనీసం 8 గంటలు ఉంచిన మంచి నీటిని రోజుకి 3 నుంచి 4 సార్లు తీసుకుంటే సరిపోతుంది. అలాగే రాగి పాత్రని సబ్బుతో కాకుండా సగం కోసిన నిమ్మ చెక్కతో లేదా వంట సోడాతో రుద్ది నీటితో కడిగితే సరిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

పెళ్లికి ఒప్పుకోలేదని తనతో గడిపిన బెడ్రూం వీడియోను నెట్‌లో పెట్టేసాడు, స్నేహితురాలు చూసి షాక్

Grand Tiranga Yatra: విజయవాడలో తిరంగ యాత్ర.. పాల్గొన్న చంద్రబాబు, పవన్

Bandla Ganesh: బాబును కలిసిన బండ్ల- రెండే నిమిషాల్లో ఆ సమస్య మటాష్

జాగ్రత్త బాబూ, అమరావతి కరకట్ట పైన కారులో వెళితే జారిపోద్ది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

తర్వాతి కథనం
Show comments