Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునగ ఆకులో ఏముందో తెలిస్తే తినకుండా వదలిపెట్టరు...

Webdunia
గురువారం, 2 మే 2019 (22:15 IST)
మనం ప్రతి రోజు రకరకాల ఆహార పదార్ధాలను, కాయగూరలను, ఆకుకూరలను తింటూ ఉంటాం. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఆకుకూరలు రక్తహీనతను తగ్గించటంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఆకుకూరల్లో ముఖ్యమైనది మునగాకు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని తరచుగా ఉపయోగించటం వలన మన ఆరోగ్యానికి అద్బుతమైన ప్రయోజనం ఉంటుంది. అది ఏమిటో చూద్దాం.
 
1. అధిక బరువుతో బాధపడేవారు లేత మునగ చిగుళ్లు రోజూ రసం తీసుకొని త్రాగితే ఒళ్లు తగ్గుతుంది.
 
2. మునగచెట్టు వేరును దంచి రసం తీసి ఆ రసంలో తేనె కలిపి పాలతో తాగిస్తే వాతపు నొప్పులు తగ్గుతాయి. పక్షవాతం ఉన్నా తగ్గుతుంది.
 
3. మునగాకులో ఉన్న ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనమేంటంటే..... ఇది లైంగిక వాంచను పెంచుతుంది. అంతేకాకుండా ఇదినపుంసకత్వాన్ని పోగొట్టడంలో ఒక సహజసిద్దమైన ఔషదంలా పని చేస్తుంది. మునగ జిగురు ఆవు పాలలో మెత్తగా నూరి నుదురుమీద, కణతల మీద పట్టి వేస్తే తలనొప్పి త్వరగా తగ్గుతుంది. 
 
4. మునగాకులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని పప్పులో పెట్టుకొని వారంలో రెండు రోజులు తినటం వలన శరీరానికి కావలసిన కాల్షియం అందుతుంది. ఇది కీళ్లనొప్పులను తగ్గిస్తుంది.
 
5. మునగాకులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. దీనిని ప్రతిరోజు తీసుకోవటం వలన కళ్లను ఆరోగ్యంగా ఉంచి కంటి చూపును మెరుగుపరుస్తుంది.
 
6. ఒక టేబుల్ స్పూన్ మునగాకు ఫేస్టులో కొంచెం తేనె, కొంచెం నీటిని కలిపి ప్రతిరోజు ఖాళీ  కడుపుతో త్రాగటం వలన శరీరంలోని కొవ్వు తగ్గుతుంది.
 
7. మునగాకు ఎముకలను ధృడంగా ఉంచడమే కాకుండా సౌందర్య సాధనంగా కూడా ఇది ఉపయోగపడుతుంది.  ఈ పేస్టును ముఖానికి తరచూ రాసుకోవటం వలన మెుటిమలు, మచ్చలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

తర్వాతి కథనం