Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిట్కాలు : తులసి ఆకులను మజ్జిగతో కలిపి తాగితే..?

Webdunia
FILE
* తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు.
* తులసి ఆకులు, పుదీనా ఆకులు కలిపి కషాయంగా కాచి తాగితే రోజు వారీ వచ్చే జ్వరం తగ్గుతుంది.

* తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పులు తగ్గుతాయి.
* తులసి ఆకుల రసంలో తేనెని కలిపి రోజుకి రెండు సార్లు చొప్పున వేసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి.

* తులసి ఆకుల రసానికి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే గుణం ఉంది.
* తులసి ఆకులను నమిలితే జీర్ణశక్తి మెరుగవుతుంది. తులసి ఆకులతో తయారుచేసిన టీ తాగితే వాంతులు ఆగుతాయి.

* తులసి కషాయాన్ని తాగితే కాలేయానికి సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి. ఆకలి మందగించిన వారు తులసి ఆకుల రసం తీసి దానితో తమలపాకు రసమును, పంచదారతో చేర్చి కొద్ది మోతాదులో ప్రతినిత్యం సేవించిన జీర్ణక్రియ సరిగా జరిగి ఆకలి బాగా వేస్తుంది.

* తులసి రసమును తేనెతో కలిపి ఒక స్పూను ప్రతిరోజూ తాగితే నోటి పూత, గొంతునొప్పి, బొంగురుపోయిన గొంతు సాఫీగా ఉంటుంది.

* తులసి రసాన్ని తేనెలో కలుపుకొని తాగితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. తులసి శ్లేష్మ, కఫ, వాతములను హరిస్తుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments