Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లోకి ప్రవేశించిన ప్రమాదకర వైరస్ జికా?

ఆఫ్రికా దేశాలను భయభ్రాంతులకు గురిచేసిన ప్రాణాంతక జికా వైరస్ భారత్‌లోకి ప్రవేశించింది. గుజరాత్‌లోని అహ్మదా బాద్‌ సిటీలోని బాపూనగర్‌ ప్రాంతంలో ముగ్గురికి జికా వైరస్‌ సోకిన విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(

Webdunia
ఆదివారం, 28 మే 2017 (11:54 IST)
ఆఫ్రికా దేశాలను భయభ్రాంతులకు గురిచేసిన ప్రాణాంతక జికా వైరస్ భారత్‌లోకి ప్రవేశించింది. గుజరాత్‌లోని అహ్మదా బాద్‌ సిటీలోని బాపూనగర్‌ ప్రాంతంలో ముగ్గురికి జికా వైరస్‌ సోకిన విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) శనివారం నిర్ధారించింది. వైరస్‌ బారినపడిన వారిలో గర్భిణి, 64 ఏళ్ల వృద్ధుడు, బాలింత ఉన్నారు. వీరంతా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారే కావడం గమనార్హం. 
 
సాధారణ నిర్ధారణ పరీక్షలో భాగంగా అహ్మదాబా‌ద్‌లోని బీజే వైద్యకళాశాల ఆధ్వర్యంలో 93 రక్తనమూనాలపై ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్ట్‌ జరపగా వైరస్‌ ఉన్న సంగతి వెలుగులోకి వచ్చింది. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన శాంపిళ్లపై మళ్లీ నిర్ధారణ కోసం పుణెలోని ల్యాబ్‌లో టెస్టులు చేశారు. 
 
నిర్ధారణ పరీక్షల వివరాలను డబ్ల్యూహెచ్‌వోకు పంపించామని, వైరస్‌ జాడను నిర్ధా రిస్తూ అక్కడి నుంచి సమాచారం వచ్చిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో భారత్‌లోకి జికా వైరస్ ప్రవేశించినట్టు వైద్యులు నిర్ధారించారు. 

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments