Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై ఏసీల్లో 24 లేదా 26 డిగ్రీల టెంపరేచర్ మాత్రమే...

దేశంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో డిమాండ్ కూడా నానాటికీ పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో విద్యుత్‌ను ఆదా చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇకపై ఏసీలో కేవలం 24 లేదా 25 డిగ్రీల

Webdunia
ఆదివారం, 24 జూన్ 2018 (11:39 IST)
దేశంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో డిమాండ్ కూడా నానాటికీ పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో విద్యుత్‌ను ఆదా చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇకపై ఏసీలో కేవలం 24 లేదా 25 డిగ్రీల టెంపరేచర్‌ మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోనుంది.
 
ఇలా చేయడం వల్ల విద్యుత్ బిల్లులపై భారం తగ్గడంతో పాటు వినియోగదారుల ఆరోగ్యం బాగుంటుందని ప్రజల్లో అవగాహన పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఇదేసమయంలో అన్ని వాణిజ్య, ప్రభుత్వ రంగ సంస్థలూ తమ కార్యాలయాల్లో 24 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా ఏసీలను మార్చుకోవాలని విద్యుత్ శాఖ నోటీసులను పంపింది. 
 
ముఖ్యంగా, ప్రజల్లో ఆరు నెలల పాటు అవగాహన కల్పించనుంది. ఆ తర్వాత ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌ను గమనించి, 24 డిగ్రీల డిఫాల్ట్ సెట్టింగ్‌ను తప్పనిసరి చేయాలని భావిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఈ విషయమై ఏసీ తయారీదారుల కంపెనీలతో చర్చించామని అధికారులు తెలిపారు. 
 
సాధారణంగా మానవ శరీరం 35 నుంచి 37 డిగ్రీల సెల్సీయస్‌లో ఉంటుంది కాబట్టి 24 డిగ్రీల చల్లదనం హాయిగా ఉంటుందని తెలిపిన విద్యుత్ మంత్రి ఆర్కే.సింగ్ చెపుతున్నారు. కానీ, చాలా హోటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య భవనాల్లో 18 నుంచి 21 డిగ్రీల టెంపరేచర్‌ను కొనసాగిస్తున్నారని అన్నారు. దీనివల్ల విద్యుత్ వినియోగం పెరగడంతో పాటు.. విద్యుత్ బిల్లుల భారం పెరుగుతుందని చెపుతున్నారు.

అంతేకాకుండా, వినియోగదారుల ఆరోగ్యం కూడా బాగుటుందనీ, ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఉత్పన్నం కావని చెబుతున్నారు. 24  లేదా 26 డిగ్రీల టెంపరేచర్‌ను పెట్టుకోవడం వల్ల అనారోగ్యంతో బాధపడేవారు కూడా ఏసీ గదుల్లో హాయిగా నిద్రపోవచ్చని చెపుతున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments