Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో బిర్యానీ తినొద్దు.. పిల్లి, గొడ్డుకు తర్వాత.. కుక్కమాంసంతో బిర్యానీ.. సోషల్ మీడియాలో?

చెన్నైలో రోడ్ సైడ్ అండ్ హోటల్ బిర్యానీలో పిల్లుల మాంసాన్ని కలుపుతున్నారని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా చెన్నై నగరంలో భోజనప్రియులు వికారానికి గురయ్యే ఘటన వెలుగులోకి వచ్చింది. గతంలో పిల్లు

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2016 (11:30 IST)
చెన్నైలో రోడ్ సైడ్ అండ్ హోటల్ బిర్యానీలో పిల్లుల మాంసాన్ని కలుపుతున్నారని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా చెన్నై నగరంలో భోజనప్రియులు వికారానికి గురయ్యే ఘటన వెలుగులోకి వచ్చింది. గతంలో పిల్లుల బిర్యానీ అమ్ముతున్నారని వార్తలొచ్చిన నేపథ్యంలో తాజాగా కుక్కమాంసంతో బిర్యానీ తయారు చేస్తున్నారని.. వాటిని రోడ్ సైడ్ షాపుల్లో అమ్మేస్తున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించిన ప‌లు ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఈ పోస్టులు చూస్తోన్న బిర్యానీ ప్రియులకి వేవిళ్లు వ‌చ్చినంత ప‌న‌వుతోంది. 
 
సోష‌ల్‌మీడియాలో వ‌స్తోన్న ఈ వ‌దంతులు నిజ‌మా?  కాదా? అని క‌నుక్కోవ‌డానికి ‘పీపుల్‌ ఫర్‌ కెటిల్‌ ఇన్‌ ఇండియా’ (పీఎఫ్‌సీఐ) నిర్వాహకులు చెన్నైలోని పలు హోటళ్లలో నిఘా ఏర్పాటు చేశారు. ఇటీవ‌ల పీఎఫ్‌సీఐ నిర్వాహ‌కులు చెన్న‌య్‌లో మేక మాంసం పేరిట పశుమాంసాన్ని,  రోడ్డు పక్కన తోపుడు బండ్లలో బిర్యానీని పిల్లిమాంసంతో చేస్తున్నార‌ని క‌నుగొన్నారు. అవి కూడా సోష‌ల్‌మీడియాలో వచ్చిన ఫొటోల సాయంతోనే క‌నుగొన్నారు. ప్రస్తుతం కుక్కమాంసంతో తయారవుతున్న బిర్యానీ కథపై పీఎఫ్‌సీఐ ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రధాని ప్రసంగిస్తుండగానే కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ సైన్యం!

మురళీ నాయక్‌కు పవన్, మంత్రుల నివాళి.. ఫ్యామిలీకి రూ.50 లక్షల ఆర్థిక సాయం (Video)

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా : డోనాల్డ్ ట్రంప్

భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరిప్రదక్షిణ

ఛత్తీస్‌గడ్ టెన్త్ ఫలితాలు - టాప్ ర్యాంకర్‌కు బ్లడ్ కేన్సర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆపరేషన్ సిందూర్ ఆపలేదు.. కొనసాగుతుంది : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments