Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయుల సగటు ఆయుష్షు ఎంత?

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (18:26 IST)
ఇటీవలి కాలంలో భారతీయుల ఆయుష్షు కాలం బాగా తగ్గిపోయిందనే వార్తలు వింటూ వచ్చాయం కానీ, లాన్సెట్ రిపోర్టు తాజాగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ఇపుడు భార‌తీయుల స‌గ‌టు ఆయుషు 70.8 ఏళ్ల‌కు చేరుకున్నట్టు వెల్లడించింది. 
 
స‌గ‌టు జీవిత‌కాలంలో ప‌దేళ్ల ఆయుష్షు పెరిగిన‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబందించి లాన్సెట్ జ‌ర్న‌ల్ ఓ నివేదిక‌ను ప్ర‌చురించింది. 1990 ద‌శ‌కంలో ఉన్న 59.6 ఏళ్ల భార‌తీయుల స‌గ‌టు జీవిత‌కాలం.. 2019 నాటికి 70.8 ఏళ్ల‌కు చేరుకున్న‌ట్లు లాన్సెట్ రిపోర్ట్ చెప్పింది. అయితే, స‌గ‌టు ఆయుష్షు కాలం ప‌దేళ్లు పెరిగినా.. భార‌త్‌లో మాత్రం ప‌లు రాష్ట్రాల మ‌ధ్య అస‌మానత‌‌లు ఉన్న‌ట్లు లాన్సెట్ వెల్ల‌డించింది.
 
దీనికి అనేక కారణాలు ఉన్నట్టు లాన్సెట్ పేర్కొంది. ముఖ్యంగా కేరళలో మ‌నిషి జీవిత‌కాలం మ‌రింత పెరిగింది. తాజా అధ్య‌య‌నం ప్ర‌కారం ఆ రాష్ట్రంలో స‌గ‌టు వ్య‌క్తి జీవిత‌కాలం 77.3 ఏళ్ల‌కు చేరుకుందని తెలిపింది. 
 
ఇక ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఓ వ్య‌క్తి జీవిత‌కాలం 66.9 ఏళ్ల‌కు చేరుకున్న‌ట్లు లాన్సెట్ రిపోర్ట్ వెల్ల‌డించింది. ఆయుష్షు కాలం ప‌దేళ్లు పెరిగినా.. ఇండియా ప్ర‌జ‌లు మాత్రం అనుకున్నంత ఆరోగ్యంగా జీవించ‌డం లేద‌ని ఇండియ‌న్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ పేర్కొన్న‌ది. ఎక్కువ శాతం మంది దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో జీవితాన్ని కొనసాగిస్తున్నారని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

PV Sindhu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు, వెంకట సాయి.. (video)

Telangana: భర్తను చెల్లెలి సాయంతో హత్య చేసిన భార్య.. ఎందుకు ?

జనవరి 31 నుంచి అరకు ఉత్సవాలు.. మూడు రోజుల జరుగుతాయ్

తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలి: కొండా సురేఖ

కుమార్తె వచ్చాకే డాక్టర్ మన్మోహన్ అంత్యక్రియలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లపై పొంగల్ సాంగ్

అజిత్ కుమార్, త్రిష మూవీ విడాముయర్చి నుంచి లిరిక‌ల్ సాంగ్

డ్రీమ్ క్యాచర్ ట్రైలర్ చూశాక నన్ను అడివిశేష్, రానా తో పోలుస్తున్నారు : ప్రశాంత్ కృష్ణ

క్రిస్మస్ సెలవులను ఆస్వాదిస్తున్న సమంత.. వినాయక పూజ..?

3 సినిమాతో తన కెరీర్ ముదనష్టం అయ్యిందంటున్న శ్రుతి హాసన్

తర్వాతి కథనం
Show comments