Webdunia - Bharat's app for daily news and videos

Install App

జామ కాయలు తింటే నిఫా వైరస్ సోకుతుందా? పరీక్షల్లో నిర్ధారణ!

Webdunia
బుధవారం, 17 జులై 2019 (13:35 IST)
జామకాయ.. దీన్ని పేదోడి యాపిల్‌గా అభివర్ణిస్తారు. అలాంటి జామకాయ ఆరగించిన ఓ విద్యార్థికి నిఫా వైరస్ సోకింది. నిజానికి వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సోకడం సహజం. అదేసమయంలో వివిధ రకాల వైరస్‌లు కూడా విజృంభిస్తుంటాయి.

తాజాగా కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ ప్రతాపం చూపుతోంది. ఇప్పటికే ఈ వ్యాధినపడినవారు పలువురు ఉన్నారు. వీరంతా ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. తాజాగా 23 యేళ్ళ విద్యార్థికి కూడా ఈ వైరస్ సోకింది. అతనికి జరిపిన వైద్య పరీక్షలో ఈ విషయం నిరూపితమైంది కూడా. 
 
దీంతో ఈ యేడాది కేరళ రాష్ట్రంలో నమోదైన తొలి నిఫా కేసుగా గుర్తించారు. అయితే, ఈ విద్యార్థికి నిఫా వైరస్ సోకిందన్న అంశంపై వైద్యులు వివిధ రకాల వైద్య పరీక్షలు చేశారు. ఇందుకోసం ఆరుగురు వైద్యుల బృందాన్ని కేరళ ప్రభుత్వం నియమించింది. ఈ బృందం జరిపిన పరిశోధన, వైద్య పరీక్షల్లో ఓ ఆసక్తికర అంశం వెలుగు చూసింది. 
 
ఈ వైరస్ సోకిన విద్యార్థి రెండు వారాల క్రితం బాగా మగ్గి, కుళ్లిపోయిన జామకాయలు ఆరగించినట్టు తేలింది. ఈ కాయలను ఆరగించడం వల్లే ఈ సమస్య వచ్చినట్టు తేలింది. నిజానికి జామకాయలు తింటే నిఫా వైరస్ సోకదనీ కానీ, అతని ఆరగించిన కుళ్ళిపోయిన జామకాయను గబ్బిలం కొరికివుండొచ్చని అందుకే అతనికి నిఫా వైరస్ సోకివుంటుందని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ విద్యార్థి రక్తం శాంపిల్స్ తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు. 
 
ఇదిలావుంటే, నిఫా వైరస్ లక్షణాలతో బాధపడుతూ ఇటీవల కలామర్సరీ వైద్య కాలేజీలో ఆస్పత్రిలో చేరిన ఐదుగురు విద్యార్థులు ఆరోగ్యంగా కోలుకున్న తర్వాత వారంతా డిశ్చార్జ్ అయ్యారు. వీరి పరిస్థితి నిలకడగానే వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

వైఎస్సార్‌సీపీది అత్యంత నీచమైన పాలన.. నారా లోకేష్ ఫైర్

మాజీ ప్రేమికుడి వేధింపులు.. 22 ఏళ్ల టీచర్ ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే మిస్టర్ మాణిక్యం గా సముద్రఖని

సింగర్ మంగ్లీకి ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ పురస్కారం ప్రదానం

తర్వాతి కథనం
Show comments