Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలేరియా దోమతో తమాషా కాదు... ప్రతి 45 సెకన్లకు...

మలేరియా దోమతో తమాషా కాదు. అలా కుట్టి ఇలా వెళ్లిపోతుంది. కానీ ఈ మలేరియా దోమ కాటుతో ప్రపంచంలో సగం మంది జనాభా మలేరియా బారిన పడే అవకాశం ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రతి 45 సెకన్లకు ఒక శిశువు మలేరియా దోమ కాటు మూలంగా ప్రాణం విడుస

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (15:52 IST)
మలేరియా దోమతో తమాషా కాదు. అలా కుట్టి ఇలా వెళ్లిపోతుంది. కానీ ఈ మలేరియా దోమ కాటుతో ప్రపంచంలో సగం మంది జనాభా మలేరియా బారిన పడే అవకాశం ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రతి 45 సెకన్లకు ఒక శిశువు మలేరియా దోమ కాటు మూలంగా ప్రాణం విడుస్తున్నట్లు లెక్కలు చెపుతున్నాయి. అలాగే మలేరియా మరణాల్లో 90 శాతం మరణాలు ఆఫ్రికా ఖండంలోనే చోటుచేసుకోవడం గమనార్హం. 
 
ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న దేశాల్లో మలేరియా వ్యాధి విజృంభిస్తున్నట్లు వైద్యులు చెపుతున్నారు. మలేరియా నిర్మూలకు అవసరమైన చర్యలు తీసుకోవలసిన ఆవశ్యకతను వారు వివరించి చెపుతున్నారు. మురికి గుంటలు, డ్రెయిన్స్, వంటివాటిలో దోమలు నిలువకుండా వాటి నిర్మూలకు చర్యలు తీసుకోవాలంటున్నారు. 
 
మలేరియా దోమ రాత్రిపూట కుడుతుంది. మనిషి రక్తంలోకి పేరసైట్లను ప్రవేశపెట్టి రోగానికి కారణమవుతుంది. మలేరియా వ్యాధి... 9 నుంచి 14 రోజులపాటు జ్వరం, వణకడం, వాంతులు వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించాలి.

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments