Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిగిరెట్లు కాల్చే తల్లిదండ్రుల వల్ల పిల్లలకు కేన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువే!

తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక, వారిద్దరూ స్మోకర్లు అయితే మరీ హెచ్చరిక. మీరు నిత్యం సిగిరెట్లు కాలుస్తూ ఉంటే మీరు కాల్చిన పొగాకు నుసి తగిలితే చాలు మీ పిల్లల చేతులపై కేన్సర్ కారక నికోటిన్ అవశేషాలు గణనీయ స్

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2017 (08:29 IST)
తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక, వారిద్దరూ స్మోకర్లు అయితే మరీ హెచ్చరిక. మీరు నిత్యం సిగిరెట్లు కాలుస్తూ ఉంటే మీరు కాల్చిన పొగాకు నుసి తగిలితే చాలు మీ పిల్లల చేతులపై కేన్సర్ కారక నికోటిన్ అవశేషాలు గణనీయ స్థాయిలో ఉండే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోన సిన్సినాటి చిల్డ్రన్ హాస్పిటల్ మెడికల్ సెంటర్‌కి చెందిన పరిశోధకులు 700 మంది పిల్లల ఆరోగ్యంపై చేసిన పరిశోధనలు ఈ దారుణ వాస్తవాన్ని వెల్లడించాయి. తల్లిదండ్రులు సిగిరెట్లు తాగుతున్న పిల్లల్లో పాసివ్ స్మోకింక్ వల్ల కలిగే పరిణామాలు ఎదురై వారు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతోందని వైద్యులు కనుగొన్నారు. 
 
వీరిలో ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడుతున్న 25 మంది చిన్నారుల డేటాను విశ్లేషించారు. ఈ చిన్నారులందరి సగటు వయస్సు అయిదు సంవత్సరాలు. వీరిని పరిశీలించిన శాస్త్రవేత్తలు వీరి శరీరంపైనా, లాలాజలంలో కేన్సర్‌ కారక నికోటిన్‌ ఉందని కనుగొన్నారు. ఈ చిన్నారుల తల్లిదండ్రులందరూ పొగతాగేవారేనని వారు తెలిపారు.
 
పిల్లల ముందు పొగ తాగకుంటే సరిపోతుంది కదా అని తల్లిదండ్రులు భావిస్తే తప్పులో కాలేసినట్లే అని ఈ పరిశోధకులు చెబుతున్నారు. మీ పిల్లలను రక్షించే సురక్షిత మార్గం ఏదంటే  మీ ఇంట్లో ధూమపానం పూర్తిగా ఆపివేయడమే అని  వీరు చెబుతున్నారు.
 
తల్లిదండ్రులు ఇంట్లో పొగతాగడం వల్ల పిల్లల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. పాసివ్‌ స్మోకింగ్‌ వల్ల చిన్నారుల చేతులుపై, లాలాజలంలో కేన్సర్‌ కారక నికోటిన్‌ అవశేషాలు చేరుతున్నాయని వారు పేర్కొన్నారు.
 
సిన్సినాటీ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ మెడికల్‌ కేర్‌ సెంటర్‌లో 700 మంది చిన్నారుల సమాచారాన్ని శాస్త్రవేత్తలు సేకరించారు. వీరిలో ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడుతున్న 25 మంది చిన్నారుల డేటాను విశ్లేషించారు. ఈ చిన్నారులందరి సగటు వయస్సు అయిదు సంవత్సరాలు. వీరిని పరిశీలించిన శాస్త్రవేత్తలు వీరి శరీరంపైనా, లాలాజలంలో కేన్సర్‌ కారక నికోటిన్‌ ఉందని కనుగొన్నారు. ఈ చిన్నారుల తల్లిదండ్రులందరూ పొగతాగేవారేనని వారు తెలిపారు.
 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments