Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ జేబులో పెట్టుకుంటే.. రోగాలతో తిరుగుతున్నట్టే: ఆరోగ్యంతో చెలగాటమే..

ప్రస్తుతం ప్ర‌పంచాన్ని ఇంట‌ర్నెట్ శాసిస్తోంది. ఇంట‌ర్నెట్ దెబ్బ‌కు ప్ర‌పంచం మొత్తం ఓ కుగ్రామంగా మారిపోయింది. దీంతో ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రి చేతుల్లోను ఫోన్ కాదు కాదు స్మార్ట్ ఫోన్ కామ‌న్ అయిపోయింది. స్మ

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (16:11 IST)
ప్రస్తుతం ప్ర‌పంచాన్ని ఇంట‌ర్నెట్ శాసిస్తోంది. ఇంట‌ర్నెట్ దెబ్బ‌కు ప్ర‌పంచం మొత్తం ఓ కుగ్రామంగా మారిపోయింది. దీంతో ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రి చేతుల్లోను ఫోన్ కాదు స్మార్ట్ ఫోన్ కామ‌న్ అయిపోయింది. స్మార్ట్ ఫోన్‌తో ప్ర‌పంచం చేతుల్లోకి వ‌చ్చేయ‌డంతో ఎక్కడ పడితే అక్కడ ఫేస్‌బుక్‌ చూసుకుంటూ కాలం గడిపేసే వారి సంఖ్య రోజు రోజుకీ ఎక్కువవుతుంది. ఉదయం నుంచి అర్థరాత్రి వరకు ఫేస్ బుక్ చూసుకుంటూ.. షేర్స్, లైక్స్ ఇస్తూ.. ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేస్తుండే వారి సంఖ్య పెరిగిపోతోంది. జేబులో డబ్బులున్నా లేకున్నా ఖచ్చితంగా సెల్‌ఫోన్ ఉంటుంది.
 
అలా అయితే మీరు జేబులో రోగాన్ని పెట్టుకుని తిరుగుతున్నట్టే. మొబైల్ ఫోన్ చేతిలో లేక‌పోతే ఒక్క నిమిషం కూడా తోచ‌దు చాలామందికి…అది నిత్యావ‌స‌రంగా మారిపోయింది…ఇప్పుడు చాలామందికి మొబైల్ మేనియా ప‌ట్టుకుంది. ఇలాంటి సెల్‌ఫోన్ మీ ఆరోగ్యంతో చెల‌గాట‌మాడుతోంద‌ని మీకు తెలుసా…. స్మార్ట్‌ఫోన్ మీ ఆరోగ్యాన్ని ఎలా దెబ్బ‌తీస్తోందో తెలిస్తే... వాటికి జోలికి కూడా వెళ్లరు. స్మార్ట్‌ఫోన్‌తో రోగాలు కూడా స్మార్ట్‌గా వ‌చ్చేస్తున్నాయంటున్నారు నిపుణులు.
 
చాలామంది స్మార్ట్‌ఫోన్‌లో చ‌క‌చ‌కా మెసేజ్‌లు పంపుతుంటారు…దానికితోడు ఫేస్‌బుక్‌, ట్వ‌ట్ట‌ర్‌, వాట్స‌ప్‌లో కూడా మెసేజ్‌లు పంపుతుంటారు… చాట్ చేస్తుంటారు… ఇలా అస్త‌మానం మెసేజ్‌లు పంప‌డం వ‌ల్ల మోచేతి న‌రాలు దెబ్బ‌తింటాయ‌ని డాక్ట‌ర్లు హెచ్చరిస్తున్నారు. అలాగే మొబైల్‌లో వీడియో గేమ్స్ ఎక్కువ‌గా ఆడితే మెడ న‌రాలు ఒత్తిడికి గురై దెబ్బ‌తింటాయ‌ట‌. త‌ర‌చూ సెల్‌ఫోన్ వాడ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి కూడా వస్తుంది. 
 
రాత్రిపూట సెల్‌ఫోన్ నుంచి వెలువ‌డే కాంతిని చూడ‌డం వ‌ల్ల నిద్ర‌లేమి వ‌స్తుందిట. దాని ఫ‌లితంగా శ‌రీరంలో మెల‌టోనిన్ అనే హార్మోన్ ఉత్ప‌త్తి త‌గ్గిపోయి బ్రెస్ట్ కేన్స‌ర్‌, పేగు కేన్స‌ర్, ప్రొస్టేట్ కేన్స‌ర్‌ వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. 

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments