Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేంజర్ నూడిల్స్... తక్షణం దేశంలోని నెస్ట్లే నూడిల్స్ ప్యాకెట్స్ వెనక్కి... ఫుడ్ ఇన్స్‌పెక్టర్స్

Webdunia
బుధవారం, 20 మే 2015 (22:14 IST)
నూడిల్స్ సమస్య మరీ ముదిరిపోతోంది. నెస్ట్లే కంపెనీకి చెందిన నూడిల్స్ ప్యాకెట్లలో మోతాదుకు మించి లెడ్ స్థాయిలున్నాయనీ, అవి చాలా ప్రమాదకరమైనవని ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఎ) తెలిపింది. నెస్ట్లేకు చెందిన నూడిల్ ప్యాకెట్లు దేశంలో ఏయే షాపుల్లో ఉన్నాయో వాటన్నిటనీ వెనక్కి తెప్పించాలని ఆహార తనీఖీ అధికారులు ఆదేశించారు. నెస్ట్లేకు చెందిన నూడిల్ ప్యాకెట్లను తనిఖీ చేసినప్పుడు అందులో లెడ్ 17.2 పర్ మిలియన్ ఉన్నదనీ, కానీ అది 0.01 నుంచి 2.5 పర్ మిలియన్ మాత్రమే ఉండాలని తెలిపారు. లెడ్ స్థాయి మించినట్లయితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు.
 
మ్యాగీ నూడిల్స్ పిల్లల ఆరోగ్యంపై దీర్ఘకాలంలో తీవ్రమైన ప్రభావం చూపుతుందంటున్నారు వైద్యులు. ఇటీవల ఓ ప్రముఖ కంపెనీ బ్రాండ్ మ్యాగీని పరీక్షించినపుడు ప్రమాదకర స్థాయిలో అందులో మొనోసోడియమ్ గ్లుటామెట్ ఉన్నట్లు గుర్తించారు. అసలు గ్లుటమేట్ అంటే ఏమిటో కూడా తెలియదు కదా. కానీ ఇది పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పిల్లలే కాదు.. మ్యాగీ పెద్దవారు తింటే వారిపైన కూడా ఆ ప్రభావం ఉంటుంది.
 
మొనోసోడియం గ్లుటమెట్ మోతాదుకు మించి మ్యాగీలో ఉపయోగిస్తున్నట్లు ఇటీవల కొన్ని షాపులపై చేసిన తనిఖీల్లో తేలింది. ఇది ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల మ్యాగీని తీసుకునేవారిలో తలనొప్పి, చెమటలు పోయడం, ముఖం మండుతున్నట్లు అనిపించడం, మెడ ఇంకా ఇతర శరీర భాగాల్లోనూ మంటగా ఉన్నట్లు అనిపించడం జరుగుతుంది. అంతేకాదు బలహీనత కూడా వస్తుంది. 
 
దీర్ఘకాలంగా మొనోసోడియం గ్లుటమేట్ అధికంగా ఉన్న పదార్థాలను తీసుకుంటే అది నాడీ వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. ఇంకా అధిక రక్తపోటుకు కారణమవుతుంది. దీనివల్ల ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిజానికి మ్యాగీలో ఈ గ్లుటమేట్  0.01 పర్ మిలియన్ ఉండాలి. కానీ ప్రస్తుతం ఉపయోగిస్తున్న మ్యాగీల్లో ఈ స్థాయి 17 పర్ మిలియన్ ఉన్నట్లు గుర్తించారు. ఈ మోతాదులో ఉన్న మ్యాగీని తింటే ఇక ఆరోగ్యాన్ని అనారోగ్యంలోకి మనకి మనం నెట్టేసుకున్నట్లే అవుతుంది. మ్యాగీకి బదులుగా పిల్లలకు ఇంట్లో తాజాగా ఏదైనా వండి వడ్డించండి ప్లీజ్ అంటున్నారు వైద్యులు.

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

Show comments