టీ తాగితే మెదడుకి బూస్ట్ అట.. (video)

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (16:12 IST)
అవును.. తాజా పరిశోధనలో టీ తాగితే మెదడుకు బూస్ట్ ఇచ్చినట్లేనని తేలింది. టీ తాగేవారిలో మెదడు చురుగ్గా వుందని.. టీ తాగని వారితో పోల్చితే.. టీ తాగేవారి మెదడు మెరుగ్గా వుందని పరిశోధకులు తేల్చారు. 
 
మెదడు నిర్మాణానికి టీ తాగడం ద్వారా సానుకూల సహకారం అందిస్తుందనేందుకు తగిన సాక్ష్యాలు వున్నాయని.. టీ తాడం ద్వారా మెదడులో వయస్సు సంబంధిత క్షీణతకు వ్యతిరేకంగా రక్షణాత్మక ప్రభావాన్ని చూపుతుందని సూచిస్తున్నట్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫింగ్ లీ తెలిపారు. 
 
నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడి అయ్యింది. అంతేగాకుండా టీ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, మానసిక స్థితి మెరుగ్గా వుంటుందని.. హృదయ సంబంధిత వ్యాధులను కూడా ఇది నివారిస్తుందని జర్నల్ ఏజింగ్‌లో ప్రచురితమైన అధ్యయనం ద్వారా తెలిసింది. 
 
ఇందుకోసం ఏర్పడిన పరిశోధనా బృందం 60, అంతకంటే ఎక్కువ వయస్సు గల 36 మంది పెద్దలను ఎంపిక చేసింది. వారి ఆరోగ్యం, జీవనశైలి, మానసిక శ్రేయస్సు గురించి డేటాను సేకరించింది. వారికి నిర్వహించిన న్యూరో సైకలాజికల్ ఎమ్మారై స్కాన్‌ల ద్వారా టీ తాగే వారి మెదడు మెరుగ్గా వుందని.. టీ మెదడుకు ఉత్సాహాన్ని ఇస్తుందని వెల్లడైనట్లు పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనం 2015 నుండి 2018 వరకు జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాజకీయాల్లో వారసత్వాన్ని ప్రోత్సహించడం ఇష్టంలేదు : వెంకయ్య నాయుడు

అమరావతి నిర్మాణం ఇక ఆగదని అర్థమైంది.. అందుకే జగన్ అక్కసు : మంత్రి నారాయణ

సికింద్రాబాద్‌ను ముక్కలు చేస్తారా?

అత్యాచారం కేసులో కేరళలో కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే అరెస్టు

108 అశ్వాలు ఎస్కార్ట్ ... సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోడీ పూజలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mardaani 3: రాణి ముఖర్జీ నటిస్తున్న మర్దానీ 3 విడుదల తేదీ ప్రకటన

Samyuktha: బయోపిక్స్, కామెడీ క్యారెక్టర్స్ వంటి అన్ని రకాల పాత్రలంటే ఇష్టం : సంయుక్త

Maheshbabu: మహేష్ బాబు లాంచ్ చేసిన శ్రీనివాస మంగాపురం లోని జయ కృష్ణ ఫస్ట్ లుక్

Aishwarya Rajesh: ఓ..! సుకుమారి నుంచి దామినిగా ఐశ్వర్య రాజేష్ లుక్

AniL Ravipudi: సంక్రాంతి ముద్ర పడటం కూడా మంచిది కాదు : అనిల్ రావిపూడి

తర్వాతి కథనం
Show comments