Webdunia - Bharat's app for daily news and videos

Install App

చుక్కేయనిదే నిద్రపట్టట్లేదా? ఐతే ఇవన్నీ తప్పవండోయ్

మందుకొట్టలేకుండా వుండలేకపోతున్నారా? చుక్కేయనిదే.. నిద్రపట్టడం లేదా? అయితే మానసిక సంబంధిత రుగ్మతలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి తలుపుతడుతాయని తాజా అధ్యయనంలో తేలింది. సెంటర్ ఫర్ అడిక్షన్ అండ్ మెంటల్ హెల్

Webdunia
సోమవారం, 16 ఏప్రియల్ 2018 (17:50 IST)
మందుకొట్టలేకుండా వుండలేకపోతున్నారా? చుక్కేయనిదే.. నిద్రపట్టడం లేదా? అయితే మానసిక సంబంధిత రుగ్మతలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి తలుపుతడుతాయని తాజా అధ్యయనంలో తేలింది. సెంటర్ ఫర్ అడిక్షన్ అండ్ మెంటల్ హెల్త్ (ఫ్రాన్స్) పరిశోధకులు నిర్వహించిన సర్వేలో మద్యం సేవించే వారిలో అతి త్వరిగతిన మానసిక వైకల్యం, చిత్తవైకల్యం ఏర్పడుతుందని తేలింది.


ఒక మిలియన్ మందిపై జరిపిన ఈ పరిశోధనలో ఈ విషయం వెల్లడైనట్లు పరిశోధకులు తెలిపారు. మానసిక ఒత్తిడి, డయాబెటిస్, రక్తపోటు వంటివి కూడా మద్యాన్ని సేవించడం ద్వారా తప్పక వేధిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. 
 
మరోవైపు ప్రతిరోజూ ఓ గ్లాసుడు చొప్పున మద్యం తీసుకుంటే.. ఆయుష్షు 30 నిమిషాలు తగ్గిపోతుందని.. మరో అధ్యయనంలోనూ వెల్లడి అయ్యింది.

వారానికి పది గ్లాసులకు పైగా మద్యం తాగిన వారిలో ఒకటి నుంచి రెండేళ్ల ఆయుష్షు తగ్గిపోతుందని.. ప్రతివారం 18 గ్లాసులకు మించిన మద్యం తీసుకుంటే మాత్రం నాలుగైదేళ్ల ఆయుష్షు తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనకు సంబంధించి యుకే పరిశోధకులు కనుగొన్న అధ్యయనానికి సంబంధించి ఆర్టికల్‌ను శుక్రవారం ది లాన్సెట్‌లో ప్రచురించారు.

సంబంధిత వార్తలు

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

తర్వాతి కథనం
Show comments