Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి పనుల్లో సాయం చేస్తే.. శృంగార సామ్రాజ్యం మీదే...

గురజాడగారి కన్యాశుల్కంలో ఓ పాపులర్ డైలాగ్ ఉంది - వేదాల్లో అన్నీ ఉన్నాయష.. అంటూ... ఈ మాటలో సత్యాసత్యాల గురించి పక్కన పెడితే అప్పుడెప్పుడో 1957లో విడుదలైన తోడికోడళ్లు సినిమాలో గీతరచయిత కొసరాజుగారు ఓ పాట

Webdunia
గురువారం, 23 జూన్ 2016 (15:48 IST)
గురజాడగారి కన్యాశుల్కంలో ఓ పాపులర్ డైలాగ్ ఉంది - వేదాల్లో అన్నీ ఉన్నాయష.. అంటూ... ఈ మాటలో సత్యాసత్యాల గురించి పక్కన పెడితే అప్పుడెప్పుడో 1957లో విడుదలైన తోడికోడళ్లు సినిమాలో గీతరచయిత కొసరాజుగారు ఓ పాటలో - ఆడుతు పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది.. అని నాయికానాయకులతో అనిపించారు. ఆ విషయాన్నే అమెరికా పరిశోధనలు ఇప్పుడు నిరూపిస్తున్నాయి. 
 
ఇంతకీ విషయమేంటంటే -
ఇంటి పనులతో సతమతమయ్యే ఆడవారికి మగవారు సాయం చేయడం చాలా అరుదు. అడపాదడపా చేసినా ఇరుగుపొరుగు ఏమనుకుంటారో, ఎవరైనా చూస్తారేమో అనే సంశయాలతో కొట్టుమిట్టాడుతుంటారు. కానీ అలా ఒకరికొకరు సాయం చేసుకునే జంటలే శృంగారాన్ని మరింత బాగా ఆస్వాదించగలరంటోంది ఈ అధ్యయనం. వంట చేయడం, అంట్లు తోమడం, షాపింగ్ వంటి పనులు అన్నింటినీ ఒక్కరే చేసే జంటలు సగటున నెలకు 5 సార్లే శృంగారంలో పాల్గొంటుండగా, ఇలాంటి పనులను సమానంగా పంచుకునే జంటలు 6 నుండి 8 సార్లు పాల్గొంటున్నాయట. 
 
కొసమెరుపు -
ఈ అధ్యయనం వెల్లడించిన మరో విషయమేంటంటే, ఎంతో అభివృద్ధి చెందాయి, స్త్రీలకు సమాన హక్కులు ఉంటాయి అని మనం అనుకునే అమెరికాలోనూ ఇప్పటికీ 63 శాతం ఇళ్లల్లో ఎక్కువ పని భారాన్ని స్త్రీలే భరిస్తున్నారని. ఆఫీసుల్లో మగవారి కంటే ఎక్కువసేపు పని చేసి, తమ భర్త కంటే ఎక్కువ సంపాదించే మహిళలు సైతం దీనికి మినహాయింపేమీ కాదట. ఈ విషయంలో ఏ దేశ పురుష పుంగవులైనా ఒక్కటే అని మరోసారి తేటతెల్లమైంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కనుసన్నల్లోనే పహల్గాం ఉగ్రదాడి : పంజాబ్ మంత్రి!!

Bihar: భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో కలిసి విషం తాగింది.. ఆ తర్వాత ఏమైందంటే?

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

తర్వాతి కథనం