Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూల్‌డ్రింక్స్ కావు.. కిల్ డ్రింక్స్ : బాదంపాలు కూడా కల్తీనే...

మార్కెట్‌లో లభించే కూల్‌డ్రింక్స్‌పై ఆసక్తికర విషయం ఒకటి వెలుగు చూసింది. ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న శీతలపానీయాల్లో ఎక్కువ శాతం నకిలేవనట. వీటిని తాగడం వల్ల అనారోగ్యం పాలుకావడం తథ్యమని తాజా పరిశోధ

Webdunia
సోమవారం, 26 జూన్ 2017 (10:22 IST)
మార్కెట్‌లో లభించే కూల్‌డ్రింక్స్‌పై ఆసక్తికర విషయం ఒకటి వెలుగు చూసింది. ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న శీతలపానీయాల్లో ఎక్కువ శాతం నకిలేవనట. వీటిని తాగడం వల్ల అనారోగ్యం పాలుకావడం తథ్యమని తాజా పరిశోధన ఒకటి వెల్లడైంది. ముఖ్యంగా శీతల పానీయాలు ఎక్కువగా తాగితే ప్రాణాంతక రోగాలు తప్పవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కల్తీరాయుళ్లు బ్రాండెడ్‌ సీసాల్లో రసాయనాలతో తయారు చేసిన పానీయాలు నింపి అమ్మేస్తున్నట్టు తేలింది. 
 
కొన్ని కంపెనీలు తయారు చేసే కొన్ని కూల్‌డ్రింక్స్‌లో 0.05 శాతం ఆల్కహాల్‌ ఉంటుంది. దీంతో మనిషి శరీరానికి పెద్దగా నష్టం ఉండదు. కానీ నకిలీ బ్రాండ్లలో ఆల్కహాల్‌ను ఎక్కువ శాతం వినియోగిస్తున్నట్టు తేలింది. మద్యంతో కూడిన కూల్‌డ్రింక్స్‌ మరింత ప్రమాదకరం. ఇవి తాగితే 15 రకాల కేన్సర్లు వచ్చే అవకాశం ఉంది. మరికొంత మంది కల్తీరాయుళ్లు శీతల పానీయాల్లో తీపికోసం పలు రసాయనాలు కలుపుతున్నారు. ఇటువంటి పానీయాలను నెల రోజులు వరుసగా తాగితే టైప్‌ 2 మధుమేహం రావడం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే, కిడ్నీ, గ్యాస్ట్రిక్ సమస్యలూ వచ్చే అవకాశం ఉందంటున్నారు. మహిళల్లో అయితే గర్భకోశ సమస్యలు వస్తాయని గైనకాలజిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు.
 
కేవలం కూల్‌డ్రింక్స్‌లోనే కాదు.. బాదం పాలలోనూ కల్తీ జరుగుతున్నట్టు తేలింది. సాధారణంగా పాలు, బాదంపొడి, చక్కెర కలిపి బాదంపాలను తయారు చేస్తారు. కల్తీరాయుళ్లు తాము తయారు చేసే బాదంపాలకు రుచి, రంగు కోసం ఇథనాల్‌ కలిపి సీసాల్లో నింపి అమ్మేస్తున్నారు. తాగే వారికి అనుమానం రాకుండా చక్కెర శాతం ఎక్కువగా కలిపేస్తున్నారు. ఈ బాదం పాలు తాగడం వల్ల జీర్ణకోశ, మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments